అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ ప్రతిపక్ష టీడీపీ అధినేత చంద్రబాబును ఉద్దేశించి హాట్ కామెంట్ చేశారు. అవిప్పుడు చర్చనీయాంశంగా మారాయి.. సీఎం జగన్ పాలనను ఉద్దేశించి చంద్రబాబు చేసిన విమర్శలకు అమర్ నాథ్ కౌంటర్ ఇచ్చారు.. ‘చంద్రబాబు మీరేమైనా అందగాడా? లేక శోభన్ బాబు అనుకుంటున్నారా? అసలు మిమ్మల్ని కలవడానికి ఎవరైనా ఇష్టపడుతారా’ అని మండిపడ్డారు.
చంద్రబాబు గత ఐదేళ్ల పాలనే పిచ్చోడి చేతిలో రాయి అంటూ అమర్ నాథ్ నిప్పులు చెరిగారు. ఐదేళ్ల బాబు పాలనలో జనాలు స్వయంగా నరకం అనుభవించారని చెప్పుకొచ్చాడు. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు సొంతంగా అధికారంలోకి వచ్చిన సందర్భం ఒక్కటైనా ఉంటే చెప్పాలని అమర్ నాథ్ సవాల్ చేశారు. చంద్రబాబుకు మతిపోయిందో.. మత్తెక్కి మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని సెటైర్ వేశారు. చంద్రబాబుకు మందు అలవాటు లేదని.. కానీ ఓడిపోయిన తర్వాత తాగుతున్నాడు కావచ్చు అంటూ ఎద్దేవా చేశారు..
తన కుమారుడు లోకేష్ భవిష్యత్ ముగిసిపోయిందనే బాధతోనే చంద్రబాబు ఇలా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడని అమర్ నాథ్ ఎద్దేవా చేశారు. ఎమ్మార్వో వనజాక్షిని చింతమనేని కొడితే చంద్రబాబే రాజీ కుదిర్చాడని ధ్వజమెత్తారు.
సీఎం జగన్ నాలుగు నెలల్లోనే ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ దేశంలో గొప్ప సీఎంగా అవతరించాడని అమర్ నాథ్ పేర్కొన్నారు. ప్రజలు నవ్వుకునేలా చంద్రబాబు మాట్లాడవద్దని హెచ్చరించారు.