యువ ఎమ్మెల్యే హడావుడి ... ?

Update: 2022-01-22 05:49 GMT
రాజకీయాల్లో ఆ జోరు ఉండాలి. హుషార్ కూడా ఉండాలి. ఏం చేశామన్నది కాదు, ఎలా జనాలకు చెప్పుకున్నామన్నదే ఇంపార్టెంట్. అంటే కమ్యునికేషన్ స్కిల్స్ బాగా వంటబట్టాలి అన్న మాట. ఇదిలా ఉంటే విశాఖలో వైసీపీ యువ ఎమ్మెల్యే గుడివాడ అమరనాధ్ ఇపుడు బాగా హడావుడి చేస్తున్నారు. ఆయనకు ఈ మధ్యనే రూరల్ జిల్లా పార్టీ పదవి దక్కింది. అదే టైమ్ లో ఆయన బర్త్ డే కూడా వచ్చింది.

ఇక ఆయనను నమ్ముకున్న  క్యాడర్ ఊరుకుంటుందా. గుడివాడ యంగ్ డైనమిక్ లీడర్ అంటూ ప్రచారం స్టార్ట్ అయిపోయింది. మీడియాలో ఎక్కడ చూసినా ఆయనే పొస్టర్లతో  కనిపిస్తున్నారు. మా నేత ఈ రోజు ఎమ్మెల్యే రేపటి రోజున ఇంకా పెద్ద పదవి చేపడతారు అంటూ క్యాడర్ హుషార్ చేస్తున్నారు. అంటే వారి ఉద్దేశ్యం గుడివాడకు మంత్రి పదవి ఇవ్వాలని. అది దాదాపుగా ఖాయమని కూడా వారే డిసైడ్ అయిపోతున్నారు.

జగన్ మంత్రి వర్గ విస్తరణ చేపట్టడం అంటూ జరిగితే విశాఖ జిల్లా నుంచి చూసుకోవాల్సిన అవసరం లేదని, గుడివాడ మినిస్టర్ అన్నది డ్యామ్ ష్యూర్ అని కూడా అంటున్నారు. ఇక కళ్ళు మూసుకుని రాసేసుకోవచ్చు అన్నట్లుగా ఉంది వారి సరదా సంతోషం. ఇదిలా ఉంటే ఎంపీ విజయసాయిరెడ్డితో కూడా మంచిగా ఉంటూ వస్తున్న గుడివాడకు జగన్ తో మంచి సాన్నిహిత్యం ఉంది. విపక్షంలో ఉన్నప్పటి నుంచి ఆయనకు జగన్ స్పెషల్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు.

దాంతో ఆయన ఈసారి బర్త్ డే వేడుకలు మామూలుగా జరగడంలేదు. కాబోయే మినిష్టర్  అనే అనేస్తున్నారు. మా ఎమ్మెల్యేకి ఆ కళ కూడా అపుడే వచ్చేసింది అని కూడా చెప్పేస్తున్నారు. మొత్తానికి ప్రస్తుత మంత్రి ముత్తంశెట్టి కరోనా బారిన పడి ఇంట్లో ఐసోలేషన్ లో ఉంటే కాబోయే మంత్రి  గుడివాడ అని అనుచరులు హల్ చల్ చేస్తున్నారు.

మరి విశాఖలో మంత్రి పదవి తనకే అని నిన్నటిదాకా గట్టిగా ఆశపెట్టుకున్న జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే ఇపుడు సొంత పార్టీ వారితోనే విమర్శలు ఎదుర్కొంటూ ఇబ్బందులో పడిపోయారు. మరో ఎమ్మెల్యే మీద కూడా భూ ఆరోపణలు వచ్చాయని టాక్. అందువల్ల హడావుడి చేస్తే ప్రత్యర్ధులు సొంత పార్టీలోనే ఏదో ఒకటి లాగి బయట పెడతారు అని కూడా అంటున్నారు. సో నెమ్మదిగా ఉంటేనే అందం, అందలానికి అదే అసలైన మార్గమని కూడా అంటున్నారు. మొత్తానికి యువ ఎమ్మెల్యే మినిస్టర్ కావడం ఖాయమేనా అంటే జగనే దానికి జవాబు చెప్పాలి.
Tags:    

Similar News