ఆర్టీసీ వ్యవహారంలో తీవ్ర వ్యతిరేకత కొనితెచ్చుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ విషయంలో అనేక ఆరోపణలూ ఎదుర్కొంటున్నారు. కార్మిక సంఘాల నేతల నుంచి - రాజకీయవర్గాల నుంచి కేసీఆర్ పై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి కేసీఆర్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆర్టీసీకి ఉన్న రూ.65 వేల కోట్ల ఆస్తులను కాజేసేందుకే కేసీఆర్ అల్లకల్లోలం సృష్టిస్తున్నారన్నారు.
ఆర్టీసీ వాస్తవ పరిస్థితిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండు చేశారు. ఆర్టీసీకి మొత్తం ఎంత ఆస్తి ఉంది. ఎన్ని అప్పులున్నాయి..ప్రభుత్వం నుంచి రావలసిన బకాయిలు ఎన్ని..ప్రభుత్వం ఎంత మొత్తం పన్నులు విధించింది… తదితర అంశాలతో కూడిన శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఆర్టీసీపై సునీల్ శర్మ కమిటీ ఇచ్చిన నివేదికను ప్రజల ముందుంచాలని డిమాండు చేశారు.
ప్రజా రవాణా ఆగిపోవడంతో కోటి మంది ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల సమ్మెను సాకుగా చూపి ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయాలని ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నారని విమర్శించారు. 48 వేలమంది ఆర్టీసీ ఉద్యోగులు రోడ్డు మీదకు వచ్చినా…ముఖ్యమంత్రి మాత్రం సమస్యను తీవ్రంగా పరిగణించడం లేదని మండిపడ్డారు. గడిచిన ఐదేళ్లుగా ఆర్టీసీ సమస్యలపై కేసీఆర్ మిన్నకుండిపోయారని - ఆర్టీసీ యూనియన్లు సమ్మె నోటీసు ఇచ్చినా ప్రభుత్వం సకాలంలో స్పందించలేదన్నారు. ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకి వెళ్లిన తర్వాత ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని విధుల్లోకి చేరలేదన్న సాకుతో 48 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటన చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు.
మరోవైసు సీఎం కేసీఆర్ పై జస్టిస్ చంద్ర కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేని కేసీఆర్ ది నోరా? మోరీనా? అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ కండక్టర్లు - డ్రైవర్లకు నెలకు యాభై వేల రూపాయల జీతం ఇస్తున్నామని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన విరుచుకుపడ్డారు. ఏ డ్రైవర్ కు - కండక్టర్ కు అంత మొత్తం ఇస్తున్నారో చూపించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీని ప్రయివేటు పరం చేస్తామంటున్న ఆయన తన ప్రభుత్వాన్ని కూడా ప్రయివేటీకరిస్తారా అని ప్రశ్నించారు.