శనివారం దేశవ్యాప్తంగా మోడీ జన్మదినోత్సవాలు అత్యంత ఘనంగా జరిగాయి. 1950 సెప్టెంబరు 17న మోడీ జన్మించారు. ఈ సందర్భంగా జరిగిన పుట్టినరోజు వేడుకలు అత్యంత ప్రత్యేకమైనవని మోడీ తెలిపారు. గుజరాత్ లోని సుమారు 11వేళ మంది దివ్యాంగుల మధ్య ఆయన తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మోడీ... ఇప్పటివరకు ఏ ప్రధానమంత్రి అయినా దివ్యాంగుల సమక్షంలో పుట్టినరోజు జరుపుకొన్నారా అని ప్రశ్నించారు. ఇలా ఇంతమంది దివ్యాంగుల సన్నిధిలో ఉండటం తన అదృష్టంగా భావిస్తున్నానని ఆయన తెలిపారు.
దక్షిణ గుజరాత్ లోని నవ్ సారీ నగరంలో ఒకేసారి వేలమందికి వినికిడి యంత్రాలు - వీల్ చైర్లు - కిట్లు అందించడం లాంటి కార్యక్రమాలు చేపట్టారు. ఇలా ఎక్కువ మందికి ఒకేసారి ఇవన్నీ ఇవ్వడం ద్వారా గిన్నిస్ రికార్డులు కూడా సాధించినట్లయింది. గత ప్రభుత్వాలు దివ్యాంగుల కోసం కేవలం 57 శిబిరాలు మాత్రమే ఏర్పాటుచేస్తే తాము మాత్రం వచ్చిన రెండేళ్లలోనే సుమారు 4వేల శిబిరాలు నిర్వహించామని తెలిపారు. ఇదే క్రమంలో ఏ ఒక్కరూ దివ్యాంగుల పట్ల జాలి చూపించొద్దని - వాళ్లకు ఆత్మగౌరవం - సమానత్వం కల్పించాలని ఆయన ప్రజలను కోరారు. ఈ సందర్భంగా అన్ని ప్రాంతాలలో ఒకేలా ఉండేలా సైగల భాషను రూపొందించనున్నట్లు ప్రధాని ప్రకటించారు.
మొత్తం 11,232 మంది దివ్యాంగులకు వీల్ చైర్లు - మూడు చక్రాల సైకిళ్లు - స్మార్ట్ కిట్లు - స్మార్ట్ ఫోన్లు - మానసిక వికలాంగుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన సాఫ్ట్ వేర్ తో కూడిన ల్యాప్ టాప్ లు - బ్రెయిలీ స్క్రిప్టులు - ఇతర టూల్స్ - స్కాలర్ షిప్ లు ఈ సందర్భంగా అందజేశారు. వేల సంఖ్యలో ఉన్న వీరందరికీ తమిళం - ఇతర భాషలు అర్థం కానట్లే.. వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న మూగవారికి వేర్వేరు సైగల భాషలు ఉన్నాయని.. అవి కూడా ఇతర ప్రాంతాల వారికి అర్థం కావని గ్రహించి... అందరికీ అర్థమయ్యేలా ఒకే తరహా సైగలను రూపొందిస్తామని మోడీ చెప్పారు. దివ్యాంగుల పట్ల జాలి అవసరం లేదని.. వాళ్లకు ఆత్మగౌరవం, సమానత్వం కల్పించాలని మోడీ పునరుద్ఘాటించారు.