సుదీర్గ ఉత్కంఠ నెలకొంటున్నప్పటికీ...ఈ సారి కూడా గుజరాత్ బీజేపీదే అని ఎగ్జిట్ పోల్స్ తేల్చిన విషయం విదితమే. ఈ ఎగ్జిట్ పోల్స్ పై బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ స్పందించారు. గుజరాత్ ఎగ్జిట్ పోల్స్ కంటే ముందు ఒకసారి బీహార్ ఎగ్జిట్ పోల్స్ అందరూ గుర్తుకు తెచ్చుకోవాలని ఆయన సూచించారు. 2015 - నవంబర్ లో బీహార్ శాసనసభ(243 స్థానాలు)కు ఎన్నికలు జరిగాయి. అప్పట్లో కూడా బీహార్ లో బీజేపీదే విజయమని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. కానీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారయ్యాయి. మహాకూటమి(జేడీయూ - ఆర్జేడీ - కాంగ్రెస్) విజయం సాధించిన విషయాన్ని గుర్తు చేసిన తేజస్వి యాదవ్.. ఇప్పుడు కూడా గుజరాత్ - హిమాచల్ ప్రదేశ్ లో అదే పరిస్థితి ఉంటుందన్నారు. నాటి ఎగ్జిట్ పోల్స్ ను తేజస్వియాదవ్ ట్వీట్ చేశారు.
ఇదిలాఉండగా...సీఓటర్ ఎగ్జిట్ పోల్ ప్రకారం మొత్తం 182 సీట్లకు గాను బీజేపీకి 108 - కాంగ్రెస్ 74 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఇక సీఎన్ ఎన్ ఐబీఎన్ సర్వే చూస్తే బీజేపీకి 109 - కాంగ్రెస్ కు 70 సీట్లు రానున్నట్లు తేల్చింది. 2012లో బీజేపీ 115 - కాంగ్రెస్ 61 స్థానాలు గెలుచుకున్న విషయం తెలిసిందే. ఉత్తర గుజరాత్ లో కాంగ్రెస్ కు 19 - బీజేపీకి 13 సీట్లు రానున్నట్లు సీఓటర్ చెప్పింది. సౌరాష్ట్రలో బీజేపీకి 37 - కాంగ్రెస్ కు 17 సీట్లు రానున్నట్లు అంచనా వేసింది.
మధ్య గుజరాత్ లో బీజేపీకి 39 - కాంగ్రెస్ కు 24 సీట్లు రానున్నట్లు సీఓటర్ స్పష్టంచేసింది. దక్షిణ గుజరాత్ లో బీజేపీకి 19 - కాంగ్రెస్ కు 14 సీట్లు రానున్నట్లు అంచనా. ఇక ఓట్ షేర్ విషయానికి వస్తే బీజేపీకి 47.4 శాతం - కాంగ్రెస్ కు 43.3 శాతం ఓట్లు వచ్చినట్లు సీఓటర్ తెలిపింది. ఇక సహారా సమయ్ గుజరాత్ లో బీజేపీకి 110 నుంచి 120 - కాంగ్రెస్ కు 65 నుంచి 75 సీట్లు రానున్నట్లు అంచనా వేసింది. టైమ్స్ నౌ-వీఎంఆర్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీజేపీకి 109 - కాంగ్రెస్ కు 70 - ఇతరులకు 3 సీట్లు రానున్నాయి.
అటు హిమాచల్ ప్రదేశ్ లో కూడా బీజేపీదే గెలుపని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. హిమాచల్ లో మొత్తం 68 సీట్లకుగాను.. బీజేపీకి 41 - కాంగ్రెస్ కు 25 రానున్నట్లు సీఓటర్ అంచనా వేసింది. ఇండియా టుడే-యాక్సిస్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం హిమాచల్ ను బీజేపీ క్లీన్ స్వీప్ చేయనున్నది. మొత్తం 68 సీట్లకుగాను బీజేపీకి 51 - కాంగ్రెస్ కు 17 సీట్లు రానున్నట్లు ఈ ఎగ్జిట్ పోల్ తేల్చింది. ఇక ఏబీపీ న్యూస్-సీఎస్ డీఎస్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీజేపీకి 47 నుంచి 55 - కాంగ్రెస్ కు 13 నుంచి 20 సీట్లు రానున్నట్లు అంచనా. గుజరాత్ తోపాటు హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు ఈ నెల 18న అంటే సోమవారం వెల్లడి కానున్నాయి.