అధికార దర్పంతో వ్యవహరించే ముఖ్యమంత్రుల్ని ఇప్పటికే చాలామందిని చూశాం. కానీ.. ఇటీవల కాలంలో కొందరు ముఖ్యమంత్రులు అనుసరిస్తున్న తీరు చూస్తే ముచ్చట పడాల్సిందే. రాజకీయంగా వారి నిర్ణయాలు.. పాలనా పరంగా తప్పొప్పుల్ని పక్కన పెడితే.. ఏదైనా ప్రమాదంలో చిక్కుకున్న వారు ఎదురైతే వారు స్పందిస్తున్న తీరును తప్పనిసరిగా మెచ్చుకోవాల్సిందే.
తాజాగా అలాంటి ఉదంతమే గుజరాత్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపాని ప్రయాణిస్తున్న ప్రాంతంలో ఒక రోడ్డు ప్రమాదం జరిగి ఉండటం.. దాన్ని గుర్తించిన ఆయన తన కాన్వాయ్‌ను ఆపేసి మరీ.. సాయంగా నిలిచిన తీరును ఇప్పుడు అందరూ అభినందిస్తున్నారు. అసలేం జరిగిందన్నది చూస్తే..
గాంధీనగర్ లోని కోబా సర్కిల్ లో ఒక ఆటో ప్రమాదానికి గురైంది. అందులో ప్రయాణిస్తున్న వారు గాయాలపాలయ్యారు. అదే సమయంలో ఆ వైపు వెళుతున్న ముఖ్యమంత్రి విజయ్ రూపాని.. తన కాన్వాయ్‌ను నిలిపివేశారు. వెంటనే ప్రమాదంలో గాయపడిన నలుగురు మహిళల్ని.. తన కాన్వాయ్‌లోని ఒక వాహనంలో ఎక్కించుకున్నారు.
వారిని హుటాహుటిన గాంధీనగర్ సివిల్ ఆసుపత్రిలో చేర్పించారు. దగ్గరుండి మరీ చికిత్స చేయించారు. గాయపడిన వారికి అన్నివిధాలుగా అవసరమైన చికిత్సను ఏర్పాటు చేసిన ఆయన తీరును ఇప్పుడు అందరూ ప్రశంసిస్తున్నారు. ఒక రాష్ట్ర సీఎం అయి ఉండి కూడా.. రోడ్డు మీద జరిగిన రోడ్డు ప్రమాదానికి మానవత్వంతో స్పందించి.. కాన్వాయ్ కారులో పంపించటమే కాదు.. తానే దగ్గరుండి వైద్యం జరిగేలా చూడటం చూసినప్పుడు.. ఇలాంటి ముఖ్యమంత్రుల్ని మిగిలిన సీఎంలు స్ఫూర్తిగా తీసుకోవాలనిపించక మానదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/