గుజరాత్ రిజల్ట్... టీడీపీ - వైసీపీ.. రెండు పార్టీలకు పెద్ద లెసనేనా...!
తాజాగా జరిగిన గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. మొత్తం 182 స్థానాలున్న అసెం బ్లీ ఎన్నికల్లో ఏకంగా 150 చోట్ల విజయం దక్కించుకుంది. తిరిగి 7వ సారి అధికారంలోకి వచ్చింది. అయితే ఈ ఎన్నికల్లో చోటు చేసుకున్న పరిణామాలు.. ఏపీకి ఎలా ఉపయోగపడనున్నాయి? ఇక్కడి ప్రధాన పార్టీలు వైసీపీ, టీడీపీలు దీని నుంచి నేర్చుకోదగిన పాఠాలు ఉన్నాయా? అంటే.. ఉన్నాయనే అంటున్నారు పరిశీలకులు.
ముందు.. వైసీపీ గురించి మాట్లాడుకుంటే.. ఉచితాలు, సంక్షేమం తమను గట్టెక్కిస్తాయని అధికార పార్టీ నేతలు ఆశలు పెట్టుకున్నారు. ఇది మంచిదే. కానీ, అభివృద్ధి ఏది? అనేది ప్రజల మాట. గుజరాత్‌లో ఇదే జరిగింది. కాంగ్రెస్ సహా.. ఆమ్ ఆద్మీ పార్టీలు ప్రజలకు ఉచితాలు ప్రకటించాయి. మేనిఫెస్టోలను ఉచిత పథకాలతో ముంచెత్తాయి. అయినా..ప్రజల వాటికి మొగ్గు చూపలేదు. ఇక, ఎలాంటి ఉచితాల జోలికీ పోని.. బీజేపీకి ప్రజలు అఖండ మెజారిటీ ఇచ్చారు. సో.. దీనిని బట్టి వైసీపీ చాలానే నేర్చుకోవాల్సి ఉంది.
ఇక, టీడీపీ విషయానికి వస్తే.. గుజరాత్‌లో అధికారం దక్కించుకున్న బీజేపీ తీసుకున్న నిర్ణయాలను నిశితంగా గమనించాల్సిన అవసరం ఉంది. పార్టీకి ఉపయోగపడతారు.. అనుకున్న వారినే బీజేపీ కొనసాగించింది. ప్రజల్లో ఏమాత్రం తేడా కొడుతుంది..అనుకున్న వారిని ఎంత పెద్దవారినైనా పక్కన పెట్టింది. ఉదాహరణకు మాజీ సీఎం రూపానీకి అసలు టికెట్ కూడా ఇవ్వలేదు. ఈయన కేంద్ర మంత్రి అమిత్‌షాకు అత్యంత కావాల్సిన మనిషి. అయినా.. ప్రజల్లో వ్యతిరేకత ఉందని తెలిసి పక్కన పెట్టింది. ఇలా 42 మంది సిట్టింగులను పక్కన పెట్టింది.
అదేవిధంగా మోడీ ఇమేజ్‌ను ప్రచారం చేసుకుంటూనే విజన్-2027ను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లింది. దీనిని ప్రజలు విశ్వసించారు. అదేసమయంలో కార్యకర్తలతో బాగా పనిచేయించింది. ఫలితంగా అధిక మెజారిటీతో పీఠం దక్కించుకుంది. ఇదే విషయాన్ని టీడీపీ గమనిస్తే..
ఖచ్చితంగా ఏపీలోనూ పనిచేయని వారిని పక్కన పెట్టాల్సిన అవసరం ఉంది. కేవలం చంద్రబాబు ఇమేజ్‌పైనే ఆధారపడకుండా.. నేతలతో పనిచేయించుకునే విధంగా వ్యూహాలు మార్చాల్సిన అవసరం ఉంది. ఇది సాకారం అయితే తప్ప.. టీడీపీ ఆశించిన గెలుపు దక్కుతుందా? లేదా? అనేది చెప్పడం కష్టం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.