అగ్రరాజ్యం అమెరికాలో తుపాకీ విష సంస్కృతి మరోసారి కోరలు చాచింది. అమాయకులపై గుర్తు తెలియని వ్యక్తులు విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో.. ఐదు మంది మృతి చెందారు. అమెరికాలో ఈ మధ్య తరచుగా కాల్పులు చోటు చేసుకుంటున్నాయి. అమెరికాలోని ఒహాయా, న్యూజెర్సీ రాష్ట్రాల్లో ఈ కాల్పుల ఘటన కలకలం రేపుతున్నాయి. ఒహాయాలోని యాంగ్ స్టౌన్ లో టార్చ్ క్లబ్ బార్ లో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకి దిగినట్టు తెలుస్తుంది. ఈ కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా, మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బార్ లో ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకునట్టు తెలుస్తుంది. తుపాకీతో గుర్తు తెలియని దుండగులు ఈ కాల్పులకు తెగబడినట్లు పలువురు తెలిపారు.
మరోవైపు, శనివారం అర్ధరాత్రి దాటాక న్యూజెర్సీలోని సౌత్ జెర్సీలో ఓ పార్టీలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు ప్రాణాలు మృతి చెందగా, 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అమెరికాలో ఇలా వరుసగా కాల్పులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఈ కాల్పుల్లో భారత్ కు చెందిన వ్యక్తులు మృతి చెందిన సందర్భాలున్నాయి. వరుసగా కాల్పులు చోటు చేసుకుంటుండటంతో భయాందోళనకు గురవుతున్నారు.