గుణశేఖర్ సతీమణి కారుతో షేకాడించారా?

Update: 2016-03-11 04:44 GMT
ప్రముఖ సినీదర్శకులు గుణశేఖర్ అనూహ్యంగా వార్తల్లోకి వచ్చారు. దీనికి కారణం ఒక రోడ్డు ప్రమాదం. గుణశేఖర్ సతీమణి రాగిణి నడుపుతున్న కారు హైదరాబాద్ లోని మాదాపూర్ ప్రాంతంలో బీభత్సం సృష్టించిందట. ఈ ఇష్యూ గురించి పూర్తిస్థాయి సమాచారం బయటకు రానప్పటికీ.. రాగిణి కారు కారణంగా పలుకార్లు ధ్వంసం అయినట్లు చెబుతున్నారు.

ఈ ఘటన ఎలా జరిగిందన్న అంశంపై స్పష్టత లేదు. ఆమె కారు  అదుపు తప్పిన కారణంగా ముందు వెనుక ప్రయాణిస్తున్న పలు కార్లు ధ్వంసమయ్యాయని.. అదృష్టవశాత్తు కార్లలో ఉన్న వారెవరికీ ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదని.. అందరూ క్షేమంగా ఉన్నట్లు చెబుతున్నారు.  ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియరావాల్సి ఉంది.
Tags:    

Similar News