కాంగ్రెస్ కు రాజీనామా చేసిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇలాకాలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. మునుగోడు మండలంలో గురువారం రాత్రి కాల్పుల ఘటన ఒక్కసారిగా కలకలం రేపింది. మునుగోడు మండలం సింగారం గ్రామ శివారులో బైక్ పై వెళుతున్న యువకుడిపై కొందరు దుండగులు తుపాకీతో కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో బాధితుడికి తీవ్ర గాయాలయ్యాయి.
కాల్పుల బాధితుడు నిమ్మల స్వామిది నార్కెట్ పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంల గ్రామం. స్వామి మునుగోడులో జనరల్ కిరాణ స్టోర్, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు.
రోజువారీ సాయంత్రం సమయంలో దుకాణం కట్టేసి బైక్ పై ఇంటికి వెళుతుండగా గుర్తు తెలియని కొందరు వ్యక్తులు అతడిపై మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. స్వామి వెన్నెముక భాగంలో రెండు, కుడి అరచేతికి ఒక బుల్లెట్ తగిలి కిందపడిపోయాడు. ఈ ఘటనలో స్వామికి గాయాలు కాగా.. స్థానికులు అతడిని కామినేని ఆస్పత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిస్థితి సమీక్షించారు. ఘటన స్తలంలో ఓ బుల్లెట్ గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
చిట్యాలకు చెందిన రేడియం స్టిక్కర్స్ వేసే వ్యక్తి లేదా మునుగోడుకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు తనపై కాల్పులు జరిపి ఉంటారని స్వామి అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులకు తెలిపారు. కాల్పులు జరిపిన వారి కోసం గాలిస్తున్నారు.
స్వామి కొన్నేళ్లపాటు ట్రాక్టర్ నడిపాడు. ఈ ఏడాది ఏప్రిల్ లో ఓ వాటర్ బాటిల్ కంపెనీ డీలర్ షిప్ తీసుకొని మునుగోడు, చండూరు మండలాలకు సరఫరా చేశాడు. మునుగోడులోని లక్ష్మీదేవిగూడెంలో ఉన్న తన గోదామునకు చెందిన బ్రహ్మణపల్లె నుంచి రాకపోకలు సాగిస్తుండగా.. బైక్ పై స్వగ్రామానికి వెళ్తుండగా బైక్ పై వచ్చిన దుండగులు పిస్టల్ తో నాలుగు రౌండ్లు కాల్పులు జరిపి పారిపోయారు.