అన్యాయం ఏదైనా జరిగినా.. మోసానికి గురైనా.. జరగరానిది ఏం జరిగినా సరే వెనువెంటనే మనకు గుర్తొచ్చేది పోలీసులే. అలాంటి పోలీసులే బాధితులుగా మారిపోయిన దుస్థితి పంజాబ్ లో చోటు చేసుకుంది. వాహనంలో వెళుతుంటే.. నాటకీయంగా దాన్ని ఆపేసి.. దోచేసుకోవటం ఇప్పటికి కొన్ని వేల సార్లు జరిగి ఉంటుంది. కానీ.. తాజా ఘటనలో అలా ఆపి దోచుకున్నది పోలీసుల వాహనాన్ని కావటం సంచలనంగా మారింది. అందులోకి సదరు వాహనం ఎస్పీది కావటం గమనార్హం.
పంజాబ్ లోని గురుదాస్‌పూర్ జిల్లా ఎస్పీ రాత్రివేళలో కారులో వెళ్తున్నారు. జమ్మూ.. పతన్ కాట్ నేషనల్ హైవే మీద వెళుతున్న ఆయన కారును కొందరు ఆపారు. వాహనాన్ని ఆపిన తర్వాత కారులో ఉన్న పోలీసు ఉన్నతాధికారి తలకు తుపాకీ గురిపెట్టి కారును దోచేశారు. పోలీసు ఉన్నతాధికారిని ఆపి మరీ తీసుకెళ్లిపోవటంతో వారు అవాక్కు అయిన పరిస్థితి.
ఈ ఘటనలో కారు డ్రైవర్ కాసింత గాయపడ్డారు. సామాన్యులకు ఇలాంటి అనుభవాలు మామూలే అయినా.. ఎస్పీ స్థాయి అధికారికి ఇలాంటి చేదు అనుభవం ఎదురుకావటం సంచలనంగా మారింది. కారును తీసుకొని పోలీసులు వెళ్లిపోయిన తర్వాత బతుకుజీవుడా అంటూ.. బయటపడిన పోలీసు అధికారి.. పక్కరోజు తన పవర్ తో గాలింపులు జరిపారు. అక్కడి అటవీ ప్రాంతంలో పోలీసు అధికారి కారును కనుగొన్నారు.