మలయాళీ ముద్దుగుమ్మ ప్రియా వారియర్ ''ఒరు అదార్ లవ్" లో కన్నుగీటి దేశ వ్యాప్తంగా ఎంత పాపులారిటీ సంపాదించిందో...ఇప్పుడు ముంబై కి చెందిన ఓ యువతి పోస్ట్ చేసిన సేవ్ సుప్రియా అన్న పోస్ట్ నెట్టింట్లో తెగ హడావిడి చేస్తుంది.
సోషల్ మీడియాలో మంచైనా ..చెడైనా క్షణాల్లో వైరల్ అవుతుంది. మంచివాళ్ల కు కనకపు సింహాసనం వేస్తే ...ఆకతాయిలకు మాత్రం తాటి తీసి వదిలిపెడుతుంది.
ఇక అసలు విషయానికొస్తే ముంబైకి చెందిన ఐశ్వర్య శర్మ ఇటీవల అంధేరీలోని ఓ పబ్ కు వెళ్లింది . ఆ సమయంలో అటుపక్కగా వెళుతున్న ఇద్దరు యువకులు మరో యువతి గురించి గుసగుసలాడుతున్నారు. ఆ మాటలన్నీ ఐశ్వర్య చెవిలో పడ్డాయ్ . దీంతో షాక్ తిన్న ఐశ్వర్య క్షణం ఆలస్యం చేయకుండా పబ్ కు వెళ్లే సమయంలో ఏం జరిగిందనే విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇప్పుడా పోస్ట్ సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది.
ఐశ్వర్య పబ్ కు వెళుతుండగా ఇద్దరు యువకులు ఇలా మాట్లాడుకుంటున్నారు. బ్రో..నేను నా లవర్ సుప్రియా కళ్లు గప్పి నిన్నరాత్రి నిధితో వెళ్లాను. ఇద్దరం బాగా ఎంజాయ్ చేశాం. ఆ మాట విన్న అతని స్నేహితుడు నువ్వు సూపర్ రా మామ .. సుప్రియా ఆ విషయాన్ని కనిపెట్టలేదులే అంటూ సపోర్ట్ చేయడంతో ఈ మాటలు విన్న ఐశ్వర్య చిర్రెత్తిపోయింది. ప్రేమ పేరుతో ఆడపిల్లల్ని ఎలా మోసం చేస్తారు...? ఎంత కష్టమైన సరే ఆ సుప్రియా ఎవరో కనిపెట్టి ప్రియుడు చేస్తున్న మోసాన్ని చెప్పాలనుకుంది.
కానీ అది సాధ్యమయ్యే పనికాదు. సోషల్ మీడియాలో సుప్రియా అన్న పేరుతో బోలెడు అకౌంట్లను ఉన్నాయి. మరి వారిలో అసలైన సుప్రియా ఎవరో తెలుసుకోవాలంటే చాలా కష్టం. అందుకే "సేవ్ సుప్రియా" అనే హ్యాష్ ట్యాగ్ తగిలించి సుప్రియా పేరుతో ఉన్న అమ్మాయిలందరికీ విజ్ఞప్తి చేసింది.
సుప్రియా. నీ బాయ్ ఫ్రెండ్ పేరు అమన్ అయితే వాడితో జాగ్రత్తగా ఉండు. వాడు నిన్ను మోసం చేసి నిధితో తిరుగుతున్నాడు. అని పోస్ట్ చేసింది. సుప్రియా పేరుతో ఉన్న అమ్మాయిలందరికీ విజ్ఞప్తి. మీ బాయ్ ప్రెండ్ లలో ఎవడైనా అమన్ పేరుతో ఉంటే... వెంటనే వాడితో బ్రేకప్ చెప్పేయండి. సుప్రియకు చేరేదాకా దీన్ని షేర్ చేయండి..' అంటూ ఐశ్వర్య తన పోస్టులో పేర్కొంది.
ఇప్పుడా పోస్ట్ కు విపరీతమైన స్పందన వస్తుంది. ఎంతలా అంటే ముంబై లో మొదలైన ఈ హ్యాష్ ట్యాగ్ ముంబై , బెంగళూరు, ఢిల్లీ, కోల్ కతా, హైదరాబాద్ లలో సుడిగాలి పర్యటనలు చేస్తుంది.
దీనిపై స్పందించిన నెటిజన్లు సుప్రియా మద్దతు తెలుపుతున్నారు. మరికొందరు ఆ స్టుపిడ్ ఫెలోస్ ఎంత పనిచేశారంటూ తిట్టిపోస్తున్నారు.
ఇదిలా ఉంటే ఐశ్వర్య చేసిన పోస్ట్ వైరల్ అవ్వడంతో ఆ నెటిజన్ షాక్ అయ్యింది. తాను ఆఫీసు నుంచి బయటకొచ్చి ఫేస్ బుక్ ఆన్ చేసేసరికి ఊహించలేనంత స్పందన వచ్చిందని మరో పోస్టులో చెప్పుకొచ్చింది. తన పోస్టును షేర్ చేసిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలిపింది.