రాజకీయం అంటే ఇదే కాబోలు. మొన్నటి వరకూ వారిద్దరూ చెరోపార్టీలో ఉంటూ చాలెంజ్ లు చేసుకునే వాళ్లు. ఒకర్నొకరు తీవ్రంగా విమర్శించుకునే వాళ్లు. వాళ్లగొడవ ఎంత వరకూ వెళ్లిందంటే లైవ్ టీవీ షోలో బూతులు తిట్టుకునేంత వరకూ వెళ్లింది. రాయలేని భాషలో వారిద్దరూ దూషించుకున్నారు. ఆ తీరు ఎలక్ట్రానిక్ మీడియాలో బాగా చర్చనీయాంశంగా నిలిచింది.
అలా తిట్టుకున్న వాళ్లే సీఎం రమేశ్- జీవీఎల్ నరసింహారావు. వీరిలో జీవీఎల్ బీజేపీ తరఫున ఎంపీగా ఉన్నారు. ఇక ఎన్నికల ముందు వరకూ తెలుగుదేశం పార్టీలో, చంద్రబాబుకు సన్నిహితుడిగా ఉండిన సీఎం రమేశ్ సంగతి వేరే చెప్పనక్కర్లేదు. చంద్రబాబును ఎవరైనా ఏమైనా అంటే అయన మీద పడి రక్కేసినట్టుగా మాట్లాడేవారు.
ఆ పరిణామాల్లో జీవీఎల్ నరసింహారావు పలు సార్లు బీజేపీని నిలదీశారు. దానికి సీఎం రమేశ్ గయ్యి మన్నాడు. ఆ సమయంలో వీరిద్దరూ సహనం కోల్పోయారు. నరసింహారావును ఉద్దేశించి తీవ్రంగా దూషించాడు సీఎం రమేశ్. బూతులు తిట్టుకున్నారు. రాయలేని భాషలో నిందించుకున్నారు.
అయితే అదంతా మూడు నెలల కిందట సంగతి. అయితే ఇప్పుడు నరసింహారావు, సీఎం రమశ్ కలిసి మీడియాకు రకరకాల విషయాలు చెబుతున్నారు. తమ పార్టీ కబుర్లను వివరిస్తూ ఉన్నారు. చాలా సరదాగా ఉన్నారు . మొన్నటి వరకూ తిట్టుకున్న వీరు ఇప్పుడు ఒకే పార్టీ నేతలుగా నవ్వుతూతుళ్లుతున్నారు. ఈ విడ్డూరాన్ని చూసి సామాన్య ప్రజలు ఆశ్చర్యపోతున్నారు!