వైసీపీ ప్రభుత్వం కేవలం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు సంచలన వ్యాఖ్యాలు చేశాడు. ఈరోజు ఆయన మీడియాలో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ తీరుపై మండిపడ్డాడు.. ఇప్పుడు జీవీఎల్ చేసిన కామెంట్లు ఎటు దారీ తీస్తాయో గానీ ఆయన మాట్లాడిన తీరు చూస్తుంటే వైసీపీతో బీజేపీకి అమీతుమీ తేల్చుకునే దిశగానే అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది..
అమరావతిలో భూసేకరణ అవసరానికి మించి చేశారని జీవీఎల్ టీడీపీపై విమర్శలు చేస్తూనే మరోవైపు ఆ సేకరించిన భూముల్లో రాజధాని కొనసాగించే ఉద్దేశం వైసీపీకి లేదని చెపుతూ - మరి భూములు ఇచ్చిన రైతులు పరిస్థితి ఏమిటి అని సూటిగా ప్రశ్నించారు. పోలవరంలో రూ.2347 కోట్లు అదనంగా ఖర్చు చేశారని చెపుతున్న ప్రభుత్వం దీనికి ఎవరిని బాధ్యులను చేస్తారో చెప్పాలని మరో ప్రశ్న సంధించాడు.
జీవీఎల్ నర్సింహారావు చేసిన ఈ కామెంట్లతో అటు ప్రతిపక్ష టీడీపీని ప్రశ్నిస్తూనే - మరోవైపు వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టినట్టుగా ఉన్నాయి. టీడీపీ చేసిన పని బాగా లేదంటూనే వైసీపీ చేసేవి కక్షపూరితంగా ఉన్నాయని నర్మగర్భంగా చెప్పాడు. ఇప్పుడు జీవీఎల్ చేసిన కామెంట్లు ఏపీలో రాజకీయ దుమారాన్నే రేపుతాయని చెప్పడంలో ఏలాంటి సందేహం లేదు.. ముఖ్యంగా వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాలి మరి.
ఇక ఇప్పటికే కొద్ది రోజులుగా ఏపీలో బీజేపీ నేతలంతా వైసీపీ టార్గెట్ గా చేసుకుని తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో పాటు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ - పురందేశ్వరితో పాటు రాష్ట్ర నేతలు వైసీపీపై విమర్శలు చేస్తున్నారు. ఇక తాజాగా ఈ లిస్టులోకి జీవీఎల్ కూడా చేరిపోయారు. ఏదేమైనా బీజేపీ వైసీపీని గట్టిగా టార్గెట్ చేసేందుకు రెడీ అవుతున్నట్టే కనిపిస్తోంది.