బీజేపీని ముంచ‌డానికి జీవీఎల్ చాలు

Update: 2019-04-01 07:10 GMT
ఏ రాజ‌కీయ పార్టీకి అయినా ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటే కొంచెం భ‌య‌మే. ఎందుకంటే... నోటికి ఎంతొస్తే అంత మాట అనేయ‌గ‌ల‌డు. ఏ మాట అన‌డానికి వెనుకాడ‌డు. త‌న‌ను కామెంట్ చేసిన వారికి కౌంట‌ర్ ఇవ్వ‌కుండా వ‌దిలిపెట్ట‌డు. ఇపుడు తాజాగా ఈ విష‌యాలేమీ ప‌ట్ట‌ని జీవీఎల్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ పై దారుణ‌మైన కామెంట్లు చేశారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్యాకేజీ క‌ళ్యాణ్‌ గా మారిపోయార‌ని తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. అందువ‌ల్లే లోకేష్ కు వ్య‌తిరేకంగా మంగ‌ళ‌గిరిలో ప్ర‌చారం చేయడం లేద‌ని విమ‌ర్శించారు. ఆయ‌న సినిమాల్లోనూ న‌టుడే - రాజ‌కీయాల్లోనూ న‌టుడే...ఇక‌నైనా నాట‌కాల‌కు ఫుల్‌ స్టాప్ పెట్టాల‌ని విమ‌ర్శించారు.

అయితే, జీవీఎల్ కామెంట్ల‌పై ప‌వ‌న్ ఇంకా స్పందించ‌లేదు. నిజానికి ఈ కామెంట్ల‌పై బీజేపీయే ఉలిక్కి ప‌డింది. క‌న్నాను పార్టీ అధ్య‌క్షుడిగా చేసింది కాపు ఓట్ల కోస‌మే. ఆ పార్టీ ఆశ‌పెట్టుకున్న ఏకైక సీటు వైజాగ్ ఎంపీ. పురంధేశ్వ‌రిని నిల‌బెట్ట‌డం - అది కూడా ఉత్త‌రాది వారి ఓట్ల‌పై ఆధార‌డ‌టం వ‌ల్ల వంటి అనేక కోణాల‌తో గెలుస్తామ‌ని భావిస్తోంది. కానీ చివ‌ర‌కు జీవీఎల్ వ్యాఖ్య‌ల‌తో కాపులు తిర‌గ‌బ‌డ‌తారేమో అని బీజేపీ జంకుతోంది.

టీడీపీ- వైసీపీకి రెండు కొన్ని బ‌ల‌మైన కులాలు అండ‌గా ఉన్నాయి... చిరంజీవి అనంత‌రం కాపులు మ‌ళ్లీ ప‌వ‌న్‌ ను రాజ‌కీయంగా న‌మ్మే ప‌రిస్థితి లేదు. ఆ కులానికి అండ‌గా నిల‌బ‌డితే మ‌న‌కు ఆ కులం అండ‌గా ఉంటుంద‌ని బీజేపీ చేస్తున్న ప్ర‌య‌త్నాల‌కు జీవీఎల్ భారీ స్పీడ్ బ్రేక‌ర్‌ లా మారిన‌ట్లు అయ్యింది.  మ‌రి ప‌వ‌న్‌ - జ‌న‌సేన పార్టీ జీవీఎల్‌ పై ఎలా స్పందిస్తుందో చూడాలి.
Tags:    

Similar News