అవకాశాల స్వర్గదామంగా పేరొందిన అగ్రరాజ్యం అమెరికాలో నైపుణ్యవంతులైన ఉద్యోగులకు గత కొంతకాలంగా ఎదురవుతున్న కష్టాల కోణంలో మరో కొత్త ఎపిసోడ్ తెరమీదకు వచ్చింది. అమెరికాలో H-1B వీసాలపై పనిచేస్తున్న ఉద్యోగులు దోపిడీకి గురవుతున్నారని - అక్కడ పని వాతావరణం చాలా దారుణంగా ఉండటమే కాకుండా... ఉద్యోగులు వేధింపులకు గురవుతున్నారనే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సౌతాసియా సెంటర్ ఆఫ్ ది అట్లాంటిక్ కౌన్సిల్(SACAC) సంస్థా తాజాగా వెలువరించిన ఓ నివేదికలో ఈ అంశాలు పేర్కొంది.
పలు సిఫార్సులతో ఓ రిపోర్టు విడుదల చేసిన సౌతాసియా సెంటర్ ఆఫ్ ది అట్లాంటిక్ కౌన్సిల్ ఉద్యోగుల వేతనాలు భారీగా పెంచాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. ‘‘ప్రస్తుత హెచ్1బీ వీసా వ్యవస్థ అమెరికన్లకు హానికరం. అలాగే H-1B వీసాపై పని చేసే ఉద్యోగులు కూడా దోపిడీ - వేధింపులకు గురవుతున్నారు. వారికి తక్కువ జీతాలు చెల్లిస్తున్నారు. సరైన పని వాతావరణం కల్పించట్లేదు ” అని SACAC తెలిపింది. ఉద్యోగులకు సరైన పని వాతా వరణం ఉండేలా చూసుకోవాలని - మరిన్ని ఉద్యోగ హక్కులు కల్పించాలని చెప్పింది. అప్పుడే వారి జీవితాలు బాగుపడుతాయంది. ఈ రిపోర్టును హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన రోన్ హీరా - SACAC హెడ్ భరత్ గోపాలస్వామి రూపొందించారు. హెచ్1బీ వీసా నిబంధనలను త్వరలోనే మారుస్తామని - వీటిని మరింత సులువు చేస్తామని - పౌరసత్వం కచ్చితంగా ఇచ్చేలా చూస్తామని ఈ మధ్యనే అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ క్రమంలో H-1B ఉద్యోగుల జీతాలు - పరిస్థితులను మెరుగుపరచాలంటూ అట్లాంటిక్ కౌన్సిల్ రిపోర్టు విడుదల చేసింది. H-1B వీసాదారుల్లో ఎక్కువ మంది భారతీయులు ఉన్న సంగతి తెలిసిందే.
కాగా, సౌతాసియా సెంటర్ ఆఫ్ ది అట్లాంటిక్ కౌన్సిల్ మూడు సంస్కరణలు సూచించింది. ఉద్యోగులందరికీ వీటిని వర్తింపజేయాలని చెప్పింది. H-1B వర్కర్లకు జీతాలను పెంచాలి. ఉత్తమ, చురుకైన ఉద్యోగులను ఆహ్వానించాలని అమెరికా భావిస్తే.. నైపుణ్యానికి తగ్గట్లు గా వారికి భారీ స్థాయిలో జీతాలు చెల్లించాల్సిందే అనేది ఒక ప్రతిపాదన. అమెరికాకు చెందిన వర్కర్లను తరచూ నియమించుకుంటామని, అర్హులకే ఉద్యోగాలిచ్చామని నిరూపించుకోవాలని మరో సూచన చేసింది. H-1B వీసా విధానం అమలుకు సమర్థమైన ఎన్ ఫోర్స్ మెంట్ మెకానిజం ఉండాలని ఇంకో సూచన చేసింది.
Full View