ఐపీఎల్లో దక్కని ఛాన్స్..ఇంగ్లీష్​ కౌంటీల్లో హనుమ విహారి..

Update: 2021-04-07 17:30 GMT
హనుమ విహారి టెస్ట్ క్రికెట్​ ఆడటంలో  మేటి  ఆటగాడు. అతడు క్రీజులో ఉన్నాడంటే ఇక బౌలర్లకే చుక్కలే. ఎన్ని రకాలుగా మార్చి బంతిని విసిరినా.. డిఫెన్స్​ చేసుకోవడం విహారి స్టయిల్​. దీంతో అతడికి టీమిండియా టెస్ట్​ జట్టులో స్థానం పదిలమైంది. అద్భుతమైన టెస్ట్​ క్రికెటర్​ గా పేరు తెచ్చుకున్నాడు. ఆంధ్రప్రదేశ్​ కు చెందిన విహారికి అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు వచ్చింది. ఇదిలా ఉంటే హనుమ విహారిని ఐపీఎల్​ లో ఏ ప్రాంచైజీ కొనుగోలు చేయలేదు. అందుకు కారణం అతడు టెస్ట్​ ప్లేయర్​ కావడమే. సాధారణంగా ఐపీఎల్​ లో దూకుడుగా ఆడే బ్యాట్స్​ మన్లకే అవకాశం ఇస్తుంటారు. ఈ కారణంగానే హనుమ ఐపీఎల్​ లో చాన్స్​ కోల్పోయాడు.

 ప్రస్తుతం హనుమ విహారి..  
ఇంగ్లీష్​ కౌంటీల్లో ఆడబోతున్నాడు. ఈ మేరకు వార్విక్​ షైర్​ జట్టుతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇప్పటికే విహారి బ్రిటన్​ చేరుకున్నాడు. వార్విక్​ షైర్​ తరఫున కనీసం మూడు మ్యాచులు ఆడనున్నాడు. ఈ విషయాన్ని బీసీసీఐ ఖరారు చేసింది. అయితే గతంలో విహారి ఐపీఎల్​ లోనూ ఆడాడు. కానీ ఈ సారి ఛాన్స్ దక్కలేదు. 2019లో ఐపీఎల్​ లో ఢిల్లీ క్యాపిటల్స్​ తరఫున ఆడిన విహారి.. ఆ తర్వాత వేలంలో అమ్ముడు పోలేదు.

ఐపీఎల్‌ అనంతరం భారత క్రికెట్‌ జట్టు జూన్‌ లో ఇంగ్లండ్‌ కు వెళ్లనున్నది. అక్కడ ఇంగ్లండ్‌ తో ఐదు టెస్టుల సిరీస్‌ ఆడనుంది. అయితే ఈ మ్యాచ్​  ల కోసం హనుమ విహారి ఇప్పటి నుంచే ప్రాక్టీస్​ చేస్తున్నట్టు సమాచారం. 27 ఏళ్ల విహారి ఇప్పటివరకు 12 టెస్టులు ఆడాడు. అందులో ఓ సెంచరీ, నాలుగు అర్ధ సెంచరీలు  చేశాడు. మొత్తం 624 పరుగులు చేశాడు. కానీ కీలక సమయాల్లో వికెట్లు పడకుండా జట్టును కాపాడగలిగాడు. దీంతో అతడికి టెస్ట్​ ప్లేయర్​ గా ముద్ర పడింది. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో భారత్‌ డ్రా చేసుకున్న మ్యాచ్​ లో విహారి ఎంతో నేర్పు ప్రదర్శించాడు. సిడ్నీ టెస్టులో విహారి.. అశ్విన్‌ తో కలిసి నాలుగు గంటల పాటు పోరాడి జట్టును ఆదుకున్నాడు. కానీ ఈ మ్యాచ్‌ అయ్యాక గాయం కారణంగా స్వదేశానికి వచ్చేశాడు.
Tags:    

Similar News