ఎన్టీ రామారావు నమ్మిన డ్రైవర్‌...

Update: 2018-08-29 12:46 GMT
నందమూరి ఫ్యామిలీతో పాటు తెలుగు రాష్ట్రాల్లో విషాదం మిగిల్చి పోయిన నందమూరి హరికృష్ణకు చిన్నప్పటి నుండే డ్రైవింగ్‌ అంటే మహా సరదా. తన 20వ ఏట నుండే 4 వీలర్‌ డ్రైవింగ్‌ చేస్తూ ఉన్న హరికృష్ణ ఎలాంటి వాహనంను అయినా నడపడంలో దిట్ట అంటూ ఆయన సన్నిహితులు అంటూ ఉంటారు. ఎవరైనా కొత్త వాహనం తీసుకుంటే అది ఎలా ఉంటుందో అని టెస్ట్‌ డ్రైవ్‌ చేసేవారట. డ్రైవింగ్‌ అంటే ఎంత సరదా ఉండేదో, అంతే జాగ్రత్తగా డ్రైవింగ్‌ చేసేవారు అని కూడా హరికృష్ణ గురించి తెలిసిన వారు చెబుతుంటారు. హరికృష్ణ డ్రైవింగ్‌ పై చాలా నమ్మకం ఉండేది కాబట్టే ఎన్టీ రామారావు తన చైతన్య రథ సారథిగా పెట్టుకున్నారు.

ఎన్టీఆర్‌ పార్టీ పెట్టి ఎన్నికలకు వెళ్లే ముందు రాష్ట్రంలో వేల కిలోమీటర్ల మేర చైతన్య రథ యాత్ర నిర్వహించడం జరిగింది. రాత్రి, పగలు అని తేడా లేకుండా చైతన్య రథ యాత్ర ముందుకు సాగుతూ ఉండేది. రోడ్డు పొడువునా ఎన్టీఆర్‌ అభిమానులు - టీడీపీ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఉన్నా కూడా ఎంతో జాగ్రత్తగా హరికృష్ణ డ్రైవ్‌ చేసేవారు అంటూ టీడీపీ సీనియర్‌ నాయకులు చెబుతూ ఉంటారు. వేల కిలోమీటర్ల డ్రైవింగ్‌ తో హరికృష్ణ అలిసి పోయినట్లుగా అనిపించడంతో ఎన్టీఆర్‌ మరో డ్రైవర్‌ ను ఏర్పాటు చేసుకోవాలని అనుకున్నా కూడా హరికృష్ణ మాత్రం అందుకు నో అనేవారట.

ఎన్టీఆర్‌ అప్పట్లో హరికృష్ణ డ్రైవింగ్‌ విషయంలో చాలా నమ్మకంగా ఉండేవారని - సీఎం అయిన తర్వాత కూడా కొన్ని సార్లు హరికృష్ణ డ్రైవింగ్‌ లో ప్రైవేట్‌ కార్యక్రమాలకు హాజరు అవుతూ ఉండేవారు అంటూ తెలుగు దేశం పార్టీ నాయకులు చెబుతూ ఉండేవారు. హరికృష్ణకు లాంగ్‌ డ్రైవ్‌ లు మరియు స్పీడ్‌ డ్రైవింగ్‌ అంటే చాలా ఇష్టం అని, ఆయన ఇంత వయస్సులో కూడా ఏమాత్రం స్పీడ్‌ తగ్గకుండా బండి నడిపేవారు అంటూ ఆయన సన్నిహితులు అంటూ ఉంటారు. అలాంటి హరికృష్ణ తన డ్రైవింగ్‌ తప్పిందం వల్ల నేడు మృతి చెందిన విషయం తెల్సిందే. ఒకప్పుడు రోడ్డు రవాణా శాఖ మంత్రిగా సేవలు అందించిన హరికృష్ణ రోడ్డు నియమాలు పాటించకుండా సీటు బెల్ట్  పెట్టుకోకుండా డ్రైవ్‌ చేయడం ఆయన మరణంకు కారణం అయ్యింది. అన్నగారు ఎన్టీఆర్‌ ను ఎన్నో సార్లు సేఫ్‌ గా గమ్యస్థానంకు చేర్చిన హరికృష్ణ తాను మాత్రం సేఫ్‌ గా గమ్మస్థానంకు చేరడంలో విఫలం అయ్యారు. ఎన్టీఆర్‌ నమ్మిన డ్రైవర్‌ తన సొంత డ్రైవింగ్‌ లో మృతి చెందడం చాలా విచారకరం.

Tags:    

Similar News