నందమూరి ఇంట విషాధ చాయలు అలుముకున్నాయి. నందమూరి హరికృష్ణ నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. హైదరాబాద్ నుంచి నెల్లూరు వెళ్తున్న హరికృష్ణ కారు అదుపుతప్పి మరో కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడే ఉన్న ప్రత్యక్ష సాక్షి, చెన్నై నుంచి వస్తున్న ఓ ఫొటో గ్రాఫర్ తన కారును హరికృష్ణ కారు ఎలా ఢీకొట్టిందనే విషయాన్ని వివరించాడు.
ఫొటో గ్రాఫర్ మాట్లాడుతూ.. ‘చెన్నై నుంచి హైదరాబాద్ కు మేం ఐదుగురం కలిసి కారులో వస్తున్నాం.. నేనే డ్రైవింగ్ చేస్తున్నా.. ఉదయం 6 గంటల సమయంలో మేము 80 కిలోమీటర్ల వేగంతో వస్తున్నాం. ఆ సమయంలో మాకు ఎదురుగా హైదరాబాద్ నుంచి వస్తున్న కారు అదుపుతప్పి 14 అడుగుల మేర గాల్లో ఎగిరి మా వైపు దూసుకొచ్చింది. అది గమనించి నేను నా కారును ఎడమవైపు తిప్పాను. లేదంటే హరికృష్ణ కారు మా కారు మీద పడి ఉండేది. నేడు ఎడమవైపుకు రోడ్డు పక్కకు తిప్పడంతో మా కారులో ఉన్న వారు క్షేమంగా బయటపడగలిగాం.. మా కారులో కుడివైపుకు కూర్చున్న వ్యక్తికి - నాకు చిన్న చిన్న గాయాలయ్యాయి’ అని తెలిపాడు.
ఆ కారు పల్టీలు కొట్టి పడిపోయిందని. హరికృష్ణ గారు ఎగిరి దూరంగా పొదల్లో పడిపోయారని.. లేచి చూసే సరికి రోడ్డు మీద వెళ్తున్న వారు హరికృష్ణను గుర్తుపట్టి రోడ్డు మీదకు తెచ్చి పడుకోబెట్టారని ఫొటో గ్రాఫర్ తెలిపారు. ఆ తర్వాత పోలీసులకు 108కు ఫోన్లు చేశామని వివరించాడు.