12 గంటల పాటు పాటు నిర్విరామంగా..

Update: 2017-07-24 11:30 GMT
రాజకీయ నాయకులకు ఓపిక తక్కువ. అధికారిక సమావేశాల్లో రెండు మూడు గంటలు కూర్చోవడానికే చాలా కష్టపడిపోతుంటారు. కానీ తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు.. రికార్డు స్థాయిలో 12 గంటల పాటు నిర్విరామంగా సుదీర్ఘ సమావేశం నిర్వహించడం విశేషం. శనివారం నాడు ఉదయం మొదలైన ఈ సమావేశం.. అర్ధరాత్రి దాకా కొనసాగినట్లు సమాచారం. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న నీటి పారుదల ప్రాజెక్టులు.. పెండింగ్ లో ఉన్న భూ సేకరణ.. భవిష్యత్ ప్రాజెక్టులు.. ఇతర అంశాలకు సంబంధించి నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులతో హరీష్ రావు సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం.

భోజన విరామం మినహాయిస్తే ఇంకే బ్రేక్స్ తీసుకోకుండా చాలా సీరియస్ గా ఈ సమావేశాన్ని నిర్వహించారట హరీష్ రావు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అధికారులతో అప్పుడప్పుడూ సుదీర్ఘ సమావేశాలు నిర్వహిస్తుంటారు. ఆయన లాగే హరీష్ రావు కూడా మంచి సబ్జెక్ట్ ఉన్నవాడే. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం.. మల్లన్నసాగర్ రిజర్వాయర్ కాలేశ్వరం ప్రాజెక్టు పనులు.. ఇతర అంశాలపై హరీష్ రావు ఈ సమావేశంలో అధికారుల్ని అడిగి వివరాలు తెలుసుకున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
Tags:    

Similar News