ఏపీలో ఉద్యోగులకు, ప్రబుత్వానికి సంబంధించి పీఆర్సీ వివాదం తారస్థాయికి చేరింది. అయితే.. దీనిపై ఇప్పటి వరకు రాష్ట్రంలోని ప్రజా సంఘాల నేతలు.. పార్టీలు మాత్రమే స్పందించాయి. కానీ, ఇప్పుడు తెలంగాణకు చెందిన మంత్రి హరీష్ రావు ఆసక్తికర, వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నిజానికి గతంలోనూ ఇలానే.. 4 వందల కోట్లకు సీఎం జగన్ కక్కుర్తిపడి రైతులకు విద్యుత్ మీటర్లు పెట్టేందుకు సిద్ధమయ్యారంటూ.. చేసిన కామెంట్ తీవ్ర దుమారమే రేపింది. అయితే.. ఇప్పుడు.. ఉద్యోగులుచేస్తున్న ఆందోళనను కార్నర్ చేసుకుని హరీష్ రావు విరుచుకుపడ్డారు.
తాజాగా హరీష్‌రావు.. ప్రపంచ కేన్సర్ డే సందర్భంగా నగరంలోని ఎంఎన్ జె కేన్సర్ హాస్పిటల్ లో సీటీస్కాన్, డెంటల్ ఎక్స్ రే ఓపీజీ, పేషెంట్స్ అటెండెంట్ భవనంతో పాటు మొబైల్ స్క్రీనింగ్ వాహనాన్ని మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈహెచ్ఎస్, సింగరేణి, ఆర్టీసీ ఉద్యోగులతో పాటు ఇతర ఉద్యోగుల అవసరాల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం రూ. 3 కోట్లతో నిర్మించిన 24 గదుల స్పెషల్ బ్లాక్‌ను ప్రారంభించామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎంఎన్‌జే క్యాన్సర్ బడ్జెట్‌ను సీఎం కేసీఆర్ రెట్టింపు చేశారని హరీశ్‌రావు గుర్తు చేశారు.
ఈ ఆస్పత్రికి 252 పోస్టులను కొత్తగా మంజూరు చేశారు. 32 మంది డాక్టర్లు 85 మంది స్టాఫ్‌నర్సులు, 85 మంది టెక్నిషీయన్లను మంజూరు చేశామని చెప్పారు. ఉద్యోగులకు వసతులు కల్పించడంలోనూ.. వారికి చాలినంత జీతభత్యాలు ఇవ్వడంలోనూ.. తమ ప్రభుత్వమే ముందున్నారు. అయితే.. ఈక్రమంలో ఆయన ఏపీ విషయాన్ని బయటకు లాగడం చర్చకు దారితీసింది. దేశంలో ఎక్కువ జీతాలు ఇచ్చేది తెలంగాణ రాష్ట్రమేనని పేర్కొన్నారు. “పక్క రాష్ట్రంలో జీతాలు తగ్గి ఉద్యోగులు రోడ్డు మీదకు వచ్చారు” అంటూ ప్రస్తుత ఏపీ తీరును ఉద్దేశించి మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా వివాదానికి దారితీసే అవకాశం కనిపిస్తోందని అంటున్నారు.
ఇప్పటికే పలు అంశాల్లో ఇటు ఏపీ, అటు తెలంగాణ ప్రబుత్వాలు కొట్లాడుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏ చిన్న మాట తేడా వచ్చినా.. అవి రాజకీయ వ్యాఖ్యలుగా మారుతున్నాయి. ఇక, ఇప్పుడు హరిష్ చేసిన వ్యాఖ్యలు కూడా దుమారం రేపడం ఖాయమనే అంటున్నారు పరిశీలకులు. కేసీఆర్ సర్కార్ ఉద్యోగస్తులకు కావాల్సినదంతా ఇస్తోందని, జగన్ సర్కార్ మాత్రం ఉద్యోగస్తులను రోడ్డు మీద పడేసిందన్న భావనలో హరీష్ రావు చేసిన కామెంట్స్ ఏపీలో ఉద్యోగులు చేస్తున్న ఆందోళనకు మరింత ప్రోత్సాహం ఇస్తుందని.. ఇవి అక్కడి ప్రభుత్వానికి మరింత ఇబ్బందికరంగా మారుతాయని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.