తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించడంతో పాటుగా టీఆర్ ఎస్ విజయంలో - కేసీఆర్ సక్సెస్ లో కీలక భూమిక పోషించిన కేసీఆర్ మేనల్లుడు - సిద్దిపేట ఎమ్మెల్యే - మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఎట్టకేలకు బయటకు వచ్చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు అయిన తర్వాత ప్రారంభమవుతున్న తొలి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా సిద్దిపేటలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గత కేబినెట్ లో సాగునీటి శాఖ మంత్రిగా హరీశ్ రావు ప్రాజెక్టుల నిర్మాణంలో కీలక భూమిక పోషించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా కాళేశ్వరం రికార్డు టైంలో పూర్తి కావడానికి కూడా హరీశే కారణమని చెప్పాలి.
అయితే నేటి మధ్యాహ్నం అట్టహాసంగా జరిగిన కాళేశ్వరం ప్రాజెెక్టు ప్రారంభోత్సవానికి హరీశ్ కు ఆహ్వానమే అందలేదు. అంతేకాకుండా గత కొంతకాలంగా పార్టీలో ఎక్కడ కూడా కనిపించని హరీశ్... కేసీఆర్ కు దూరమైపోయారని - హరీశ్ కు ప్రాధాన్యం తగ్గిపోయిందన్న వార్తల నేపథ్యంలో కాళేశ్వరం ప్రారంభోత్సవం సందర్భంగా మేడిగడ్డలో కాకుండా సిద్దిపేటలో హరీశ్ ప్రత్యక్షం కావడం సంచలనంగా మారింది. కాళేశ్వరం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ సంబరాలను మొదలుపెట్టింది. ఈ సంబరాల్లో భాగంగా హరీశ్ సిద్దిపేటలో జరిగిన కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన కాళేశ్వరం సాధకుడు కేసీఆరేనని తేల్చేశారు. రికార్డు సమయంలో కేవలం మూడేళ్లలోనే కాళేశ్వరం పూర్తి అయ్యిందంటే అది కేసీఆర్ ఘనతేనని కూడా హరీశ్ చెప్పుకొచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలక భూమిక పోషించిన తనకు ఆ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందని విషయాన్ని ఎంతమాత్రం ప్రస్తావించని హరీశ్... కేసీఆర్ నామస్మరణే చేయడం కూడా ఆసక్తి రేపుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ పెండింగ్ లో పడిపోతే... ప్రత్యేక తెలంగాణలో మాత్రం ప్రాజెక్టులను పరుగులు పెట్టించడం ఒక్క కేసీఆర్ కు మాత్రమే సాధ్యమైందని కూడా హరీశ్ వ్యాఖ్యానించారు.