మరో ఇరవైఏళ్లపాటు టీఆర్‌ ఎస్‌ దే !

Update: 2016-04-09 11:37 GMT
గులాబీద‌ళ‌ప‌తి - తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌ర్వాత అంతే డైన‌మిక్ రాజ‌కీయ వేత్త‌గా నిలిచే ఆయ‌న మేన‌ల్లుడు హరీష్‌ రావు తాజాగా ఇచ్చిన స్టేట్‌ మెంట్ ఒక‌టి టీఆర్ ఎస్ స‌త్తాను తెలియ‌జెప్తూనే ఒకింత అతి అనే భావాన్ని కూడా క‌లిగిస్తోంది. నిజామాబాద్‌ జిల్లా ఎల్లారెడ్డిలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో పాల్గొన్న మంత్రి హ‌రీశ్‌ రావు టీఆర్ ఎస్ పార్టీ భ‌విష్య‌త్ గురించి భారీ జోస్యం చెప్పారు.

టీఆర్‌ ఎస్ ప్రభుత్వం చేస్తోన్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేకే ప్రతిపక్ష కాంగ్రెస్ నాయ‌కులు విమర్శలు చేస్తున్నారని హ‌రీశ్‌ రావు మండిప‌డ్డారు. అయితే ఎవరెన్ని విమర్శలు చేసినా మరో ఇరవైఏళ్లపాటు టీఆర్‌ ఎస్‌ దే అధికారమని పేర్కొన్నారు. ప్ర‌జాసంక్షేమ పాల‌న‌లో ముందుకువెళుతున్న టీఆర్ ఎస్ ప్ర‌భుత్వానికి ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు ఎల్ల‌ప్పుడు ఉంటుంద‌ని హ‌రీశ్‌ రావు చెప్పారు. టీఆర్‌ ఎస్ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ - మిషన్ కాకతీయను ఇతర రాష్ర్టాలు కూడా అనుసరిస్తున్నాయని తెలిపారు. ఈనెల 27 లోపు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయనున్నట్టు ఈ సంద‌ర్భంగా హ‌రీశ్‌ రావు తీపిక‌బురు చెప్పారు. అధికార పార్టీ త‌మ ప్రాభ‌వం గురించి చెప్పుకోవ‌డంలో త‌ప్పులేక‌పోయిన‌ప్ప‌టికీ మ‌రీ 20 ఏళ్లు ఒకే పార్టీ గెల‌వ‌డం సాధ్య‌మ‌య్యేదేనా అంటూ రాజ‌కీయ‌వ‌ర్గాలు సెటైర్లు వేస్తున్నాయి.
Tags:    

Similar News