తెలంగాణ అధికారపక్షంలో కేటీఆర్.. హరీశ్ రావు వర్గాలు ఎప్పుడూ మహా యాక్టివ్ గా ఉంటాయి. కానీ.. అవేమీ కంటికి కనిపించవు. టీఆర్ ఎస్ నేతలు ఏ ఇద్దరూ కలిసినా.. వారి మాటల్లో కేటీఆర్.. హరీశ్ ప్రస్తావన.. వారి మధ్య అంతర్గత పోరు లోగుట్టుగా మాట్లాడుకోకుండా ఉండరు. ఎన్ని మాటలు మాట్లాడుకున్నా.. బయటకు మాత్రం ‘‘ఆల్ ఈజ్ వెల్’’ అన్నట్లుగా వ్యవహరించటం టీఆర్ ఎస్ నేతలకే చెల్లింది.
అధినేత అంటే భయమే.. గులాబీ దండును అలా నడిపిస్తోందని చెప్పక తప్పదు. అయితే.. ఎప్పుడూ లేని విధంగా ఈ ఇద్దరు యువనేతల మధ్య పోరు ఈసారి బయటపడటం తాజా విశేషంగా చెప్పాలి. మొన్నామధ్య విడుదలైన గ్రేటర్ ఎన్నికల ఫలితాల సందర్భంగా టీఆర్ఎస్ సాధించిన అద్భుతమైన విజయాన్ని మంత్రి కేటీఆర్ తన ఖాతాలో వేసుకోవటమే కాదు.. దాన్ని ‘‘నాన్నకు ప్రేమతో..’’ అంటూ తండ్రి ఖాతాలోకి విజయవంతంగా బదిలీ చేయగలిగారు.
అంతేకాదు.. టీఆర్ ఎస్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ తర్వాత తామే అన్న విషయాన్ని కేటీఆర్ అండ్ కో చెప్పుకునే ప్రయత్నం చేశారు. దీనికి హరీశ్ వర్గం చిన్నబుచ్చుకుంది. అయితే.. తమ మనసులోని భావాల్ని హరీశ్ వర్గం బయటపెట్టుకుంది లేదు. తమదైన సమయం కోసం ఎదురుచూస్తున్న వారు.. తాజాగా చేసిన హడావుడి చూసినప్పుడు.. తమ నాయకుడ్ని పార్టీ గుర్తించాలన్న తపన హరీశ్ వర్గంలో ఎంత ఉందన్నది బయటపడింది.
మెదక్ జిల్లా నారాయణఖేడ్ ఉపఎన్నికలో 50వేల పైచిలుకు మెజార్టీ సాధించటం ద్వారా హరీశ్ రావు తన సత్తా ఏమిటో చాటుకున్నారు. కాంగ్రెస్ కంచు కోటను బద్ధలుకొట్టటమే కాదు.. రికార్డు మెజార్టీతో (ఖేడ్ నియోజకవర్గ పరిధిలో) కారు దూసుకెళ్లేలా చేయటంలో హరీశ్ సక్సెస్ అయ్యారు. ఇలాంటి రోజు కోసమే ఎదురుచూసిన హరీశ్ వర్గం నిన్న చెలరేగిపోయింది.
ఎప్పుడూ లేని విధంగా తెలంగాణ భవన్ వద్ద హరీశ్ వర్గం పెద్ద హంగామానే చేసింది. గ్రేటర్ ఎన్నికల్లో అంత పెద్ద విజయం సాధించినప్పుడే లేని హడావుడిని తాజాగా ఖేడ్ ఫలితం వెలువడిన తర్వాత చోటు చేసుకోవటం గమనార్హం. హరీశ్ జిందాబాద్ అన్న నినాదాలతో పాటు.. ఆయన ఫోటోలకు పాలాభిషేకాలు.. పలువురు హరీశ్ ను సమర్థించే నేతలు బయటకొచ్చి సందడి చేయటం విశేషం.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. హరీశ్ వర్గం ఇలా ఎంత చేసినప్పటికీ ఆయనకు మైలేజ్ రాలేదన్న మాట వినిపిస్తోంది. అదే సమయంలో.. నాన్నకు ప్రేమతో అంటూ కేటీఆర్ సాధించిన విజయాన్ని కేటీఆర్ అకౌంట్ కి విజయవంతంగా బదిలీ చేయగలిగిన స్థాయిలో హరీశ్ వర్గం.. ఖేడ్ విజయాన్ని మామకు ప్రేమతో.. అంటూ కేసీఆర్ అకౌంట్ లోకి ట్రాన్సఫర్ చేయలేకపోయారని చెబుతున్నారు. కొంతమంది కొన్నిసార్లు ఎంత కష్టపడినా.. రావాల్సినంత గుర్తింపు రాకపోవటం మామూలే. తాజాగా ఎపిసోడ్ లో మంత్రి హరీశ్ పరిస్థితి అలానే కనిపిస్తోందన్న మాట టీఆర్ ఎస్ వర్గాల్లో వినిపిస్తోంది.