తమకు వ్యతిరేకంగా ఉండే అంశాల పట్ల తెలంగాణ అధికారపక్ష సభ్యులు ఏ రేంజ్‌లో విరుచుకుపడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ.. మంత్రులు హరీశ్.. కేటీఆర్.. ఈటెల.. తలసాని లాంటి వారు ఏ స్థాయిలో తమ నోటికి పని చెప్పగలరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
వీరంతా వివిధ సందర్భాల్లో తమ నోటి పవర్ ను చూపించిన వారే. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన పాలమూరు ఎత్తిపోతల పథకానికి సంబంధించి ముఖ్యమంత్రి ఏ స్థాయిలో విరుచుకుపడింది తెలిసిందే. పాలమూరు ప్రాజెక్టుకు అనుమతులు తీసుకోలేదన్న మాటకు ఆయన లఫంగి అని కూడా అనేసిన పరిస్థితి.
ఇదిలా ఉంటే ఆదివారం మధ్యాహ్నం విపక్ష నేత జగన్.. పాలమూరు ఎత్తిపోతల పథకానికి అనుమతులు తీసుకోకుండానే శంకుస్థాపన చేసినట్లు పేర్కొంటూ కేంద్రమంత్రి ఉమాభారతికి లేఖ రాయటం తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ మీద ఏ స్థాయిలో తిట్ల వర్షం కురుస్తుందో అని పలువురు భావించినా.. ఇప్పటివరకూ ఎవరూ పెద్దగా మాట్లాడింది లేదు. తాజాగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. నక్కలగండి ప్రాజెక్టుకు వైఎస్ హయాంలోనే జీవో వచ్చిందని.. తండ్రిని అనుసరిస్తానని చెప్పే జగన్.. ఎలా వ్యతిరేకిస్తారని మాత్రమే విమర్శించారు. జగన్ విషయంలో ఎందుకో అంత ఆచితూచి విమర్శించటం..?