కాంగ్రెస్ సారథ్యంలో ఏర్పాటైన మహాకూటమి టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తున్న టీఆర్ ఎస్ పార్టీ నేతలు తమ దూకుడును మరింత పెంచుతున్నారు. ఎన్నికల గడువు సమీపిస్తున్న కొద్దీ నాయకులు తమ వాగ్దాటికి పదును పెడుతున్నారు. తాజాగా - తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ మేనల్లుడు - అపద్ధర్మ మంత్రి హరీశ్ రావు టీడీపీ - కాంగ్రెస్ లపై విమర్శలు గుప్పించారు. టీఆర్ ఎస్ ది త్యాగాల చరిత్ర అని.. తెలంగాణ కోసం పదవులను గడ్డిపోచలా త్యజించిన చరిత్ర అని హరీశ్ రావు పేర్కొన్నారు. కాంగ్రెస్‌ది అవినీతి - అక్రమాల చరిత్ర కాగా - టీడీపీది వెన్నుపోటు రాజకీయాల చరిత్ర అని ఎద్దేవా చేశారు. తెలంగాణ పోరాటంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఆత్మైస్థెర్యంతో విజయాన్ని సాధించామని చెప్పారు. మరోసారి తెలంగాణ ఆత్మైస్థెర్యాన్ని దెబ్బతీయడానికి ఆ రెండుపార్టీలు మహాకూటమి పేరుతో ప్రజల్లోకి వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాయని - వాటి కుట్రలను తిప్పికొడుదాం అని మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు.
తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేయడానికి వస్తు న్న కాంగ్రెస్ - టీడీపీలకు డిపాజిట్ దక్కనివ్వబోమని మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. ప్రతి ఎన్నికల్లో టీఆర్ ఎస్ మెజార్టీ పెంచుకుంటూ పోతుంటే.. ప్రత్యర్థి పార్టీలకు డిపాజిట్లు గల్లంతవుతున్నాయని చెప్పారు. అనేక సార్లు మోసం చేసిన కాంగ్రెస్ పై ప్రజలకు నమ్మకం పోయిందని - తెలంగాణలో టీడీపీది ముగిసిన అధ్యాయమని అన్నారు. `ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ - టీడీపీ పాలనలో అనుభవించిన కష్టాలు ఇంకా మర్చిపోనేలేదు. తెలంగాణ సాధనలో ఉద్యమ గాయాలు ఇంకా మాననేలేదు. డిసెంబర్ 11న మహాకూటమికి మహా ఓటమే మిగులుతుందని - కాంగ్రెస్ - టీడీపీది ముగిసిన అధ్యాయంగా తెలంగాణ చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు.
డిసెంబర్ 11వ తేదీన గల్లంతయ్యే కూటమి మహాకూటమి అని ఆపద్ధర్మ మంత్రి హరీష్ రావు అన్నారు. మహా కూటమి ఆఫీస్ ఢిల్లీలో ఉందా లేక అమరావతిలో ఉందా అని ప్రశ్నించారు. 'కన్ను కొట్టే సిద్ధాంతం రాహుల్ ది - రెండు కళ్ల సిద్ధాంతం చంద్రబాబు నాయుడుది' హరీష్ ఎద్దేవా చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా తమదే విజయమని హరీష్ అన్నారు. విశ్వసనీయతకు మారు పేరుగా నిలిచిన టీఆర్ ఎస్ పై ప్రజలకు నమ్మకం ఉందని - సీఎం కేసీఆర్ ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటారని ధీమా వ్యక్తం చేశారు.