తెలంగాణ రాష్ట్రంలో త్వరలో చేపట్టబోయే సాగునీటి ప్రాజెక్టుకు ఇందిరా గాంధీ - రాజీవ్ గాంధీల పేర్లు పెడతామని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖా మంత్రి - సీఎం కేసీఆర్ మేనల్లుడు తన్నీరు హరీష్ రావు ప్రకటించారు. ఖమ్మం జిల్లాలో ఉన్న రాజీవ్ సాగర్ ప్రాజెక్టును ‘సీతారామా ఎత్తిపోతల పథకం’గా పేరు మార్చడంపై శాసనమండలిలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి హరీశ్ రావు సమాధానం ఇచ్చారు.
ఖమ్మం జిల్లా భద్రాచలంలో సీతారామచంద్ర స్వామి పుణ్యక్షేత్రం ఉండడం, దానికి సమీపంలోనే ఆ ప్రాజెక్టును నిర్మించబోతున్నందున దానికి సీతారామా ప్రాజెక్టుగా మార్చామే తప్ప ఇందులో వేరే ఉద్దేశం లేదన్నారు. అలాగే సోనియాగాంధీ కుటుంబంపై తమకు కృతజ్ఞత ఉందని, ఈ పేరు మార్పునకు బదులుగా తెలంగాణలో మరో కొత్త ప్రాజెక్టుకు తప్పకుండా ఇందిరా - రాజీవ్ ల పేర్లు తప్పకుండా పెడతామని ప్రకటించారు. ఇదిలాఉండగా మే నెలలో సీతారామా ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామని, రూ.7,926కోట్లతో సీతారామా ఎత్తిపోతల పథకం నిర్మాణం జరగనుందన్నారు.