విషయాన్ని ఎంత ఓపెన్‌గా చెప్పావ్‌ హరీశ్‌?

Update: 2015-04-11 11:33 GMT
రాజకీయ నాయకులు చేసే ప్రసంగాల్ని.. వారు చేసే వ్యాఖ్యల్ని తప్పు పట్టటం కాస్త కష్టమే అయినా.. అసాధ్యం కాదు. కానీ.. కొందరు నేతలు ఉంటారు. వారు మాట్లాడే మాటల్ని వ్యంగ్యంగా విమర్శించాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సి ఉంటుంది. వారు ఎంత జాగ్రత్తగా మాట్లాడతారంటే వారి భావాల లోగుట్టును బయట పెట్టటానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది.

అలాంటి నేతల్లో తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు ఒకరు. ఆయన మాటల్ని జాగ్రత్తగా వినండి. చెప్పాలనుకున్న విషయాన్ని చాలా స్పష్టంగా సూటిగా.. సుదీర్ఘంగా చెబుతారు. సాధారణంగా ఎవరైనా ఏదైనా విషయాన్ని చెప్పే సమయంలో కొంత సమయం పోయాక తప్పులు దొర్లుతూ.. ఉత్తినే దొరికిపోతుంటారు. కానీ.. హరీశ్‌రావు మాత్రం అస్సలు దొరరు.

కాస్త కష్టపడి మనమే ఆయన్ను దొరకబుచ్చుకోవాలి. అలాంటి హరీశ్‌రావు తాజాగా చెప్పిన మాట ఆశ్చర్యాన్ని.. ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆయన చాలా ఓపెన్‌గా చెప్పిన మాట లోగుట్టును జాగ్రత్తగా విప్పితే.. అమ్మ హరీశ్‌ అన్సాల్సిందే. అలాంటి అని దానికి రుజువులు సాక్ష్యాలు కూడా ఏమీ ఉండవు మరి.

ఇంతకీ హరీశ్‌ మాట్లాడిన మాటలు ఏమిటంటే.. ప్రభుత్వ ఉద్యోగులతో స్నేహపూర్వకంగా వ్యవహరించే ప్రభుత్వం తమదని హరీశ్‌ పేర్కొన్నారు. తామంతా చక్కగా ఎవరూ చూసుకోరన్నట్లుగా ఆయన మాట్లాడారు. ఉద్యమపార్టీ.. అధికారపక్షంగా అవతరిస్తే.. ఆ మాత్రం విశాలహృదయంతో వ్యవహరించటం మామూలే. మరి.. టీఆర్‌ఎస్‌ లాంటి ఉద్యమ పార్టీకి అంత విశాల హృదయం ఉంటుందా? అన్నది ఇక్కడ క్వశ్చన్‌ మార్క్‌.

ఆ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే.. ఉద్యోగులతో స్నేహపూర్వకమే అని చెప్పిన హరీశ్‌.. దానికి కంటిన్యూ అసలైన విషయాన్ని ఒకటి చెప్పారు. అదేమంటే.. తాము ఎంత ఫ్రెండ్లీ ప్రభుత్వమో తేడా వస్తే అంతే కఠినమని కూడా తేల్చి చెప్పారు. ఉద్యోగుల్ని తామెంత గౌరవిస్తాయో చెప్పిన హరీశ్‌.. అన్ని రకాలుగా తాము వారికి సహకారం అందిస్తామని.. పనిలో మంచి ఫలితాలు చూపిస్తే.. వారు కోరుకున్న చోట పోస్టింగ్‌ ఇస్తామని కూడా అభయమిచ్చేశారు.

అలా అని తమ సహకారాన్ని అలుసుగా తీసుకోవద్దని.. ప్రభుత్వ పథకాల అమలు తీరులో తేడా వస్తే మాత్రం ఉద్యోగుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. మరి.. హరీశ్‌ మాటల్లో ఆంతర్యం.. లోగుట్టు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం ఉందా? ఏ మాటకు ఆ మాట.. ప్రభుత్వ ఉద్యోగులకు చెప్పాల్సిన విషయాన్ని ఓపెన్‌గా చెప్పేస్తూ.. ఎలాంటి వివాదాస్పదం కాకుండా మాట్లాడే సత్తా మాత్రం హరీశ్‌ మాత్రమే సొంతమని ప్రత్యేకంగా చెప్పాలా..?

Tags:    

Similar News