తెలంగాణ రాష్ట్ర ప్రయోజనానికి దెబ్బ తగులుతుందని భావిస్తే.. వెంటనే స్పందించే తెలంగాణ అధికారపక్షం.. తాజాగా కర్ణాటక సర్కారు ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపు విషయంలో పెద్దగా పట్టనట్లుగా ఉంది.
సమాచారం లేకపోవటమో.. ఏపీ సర్కారు పై పెట్టినంత దృష్టి కర్ణాటక సర్కారు మీద పెట్టకపోవటమో కానీ.. పలు సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కర్ణాటక సర్కారు చేపట్టిన చర్యలు తెలంగాణ ప్రయోజనాలకు తీవ్రంగా దెబ్బ తీయటం ఖాయం. ఈ విషయాన్ని మూడు రోజుల కిందట టీటీడీపీ అధ్యక్షుడు రమణ తెరపైకి తీసుకొచ్చారు.
కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన పలు ఇరిగేషన్ ప్రాజెక్టుల కారణంగా తెలంగాణ ప్రయోజనాలకు దెబ్బ పడటం ఖాయమని.. తెలంగాణ అధికారపక్షం వీటిని గుర్తించి.. అడ్డుకోవాలని పిలుపునివ్వటం తెలిసిందే. వాస్తవానికి ఇలాంటి అంశాలపై అందరి కంటే ముందుండే తెలంగాణ అధికారపక్షం వెనుకపడింది. అలా అని ఆయా అంశాల్ని వదిలేయని మంత్రి హరీశ్.. తాజాగా స్పందించారు.
తెలంగాణ ప్రయోజనాల్ని దెబ్బ తీసేందుకు అవకాశం ఉన్న ప్రాజెక్టులపై నివేదిక తయారు చేయాలని.. కర్ణాటక వైఖరిని నిరసిస్తూ.. కేంద్రానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. అంతేకాదు.. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు కలిసి ఇలాంటి వైఖరిని ప్రశ్నించాలని ఆయన పిలుపునిచ్చారు.
అసలీ విషయాన్ని ప్రస్తావించిందే టీటీడీపీనే అన్న విషయాన్ని మర్చిపోకూడదు. కర్ణాటక పాల్పడుతున్న అక్రమాలను తెరపైకి తెచ్చిన టీ టీడీపీ ప్రస్తావన తీసుకురాకుందానే.. కర్ణాటక సర్కారు మీద పోరాటానికి సిద్ధం కావాలని మంత్రి పిలుపునివ్వటం గమనార్హం. విపక్షాలన్నీ కలిసి రావాలని పిలుపునిచ్చే హరీశ్.. వారు చేసే మంచి గురించి అప్పుడప్పడు ప్రస్తావిస్తే పోయేదేముంటుంది? అంత విశాల హృదయం హరీశ్ నుంచి ఆశించొచ్చా..?