తెలంగాణ జేఏసీ మాజీ చైర్మన్ - తెలంగాణ జనసమితి నాయకుడు ప్రొఫెసర్ కోదండరాం టార్గెట్ టీఆర్ ఎస్ నేతలు దూకుడుగా ముందుకు సాగుతున్నారు. తాజాగా తెలంగాణ భవన్ లో మంత్రి హరీష్ రావు ఆసక్తికరమైన వ్యాఖ్యాలు చేశారు. సమక్షంలో ప్రయివేటు ఉద్యోగుల సంఘం నేతలు టీఆర్ ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ సాధించేంత వరకు కోదండరాంను కంటికి రెప్పలా కాపాడుకున్నామని తెలిపారు. కోదండరాంపై కాంగ్రెస్ ఎంత కుట్ర చేసిందో - చంద్రబాబు ఎంత అవమానపరిచాడో ఆయన మరిచిపోయిన ప్రజలు మరిచిపోరు. వలస పార్టీలకు వ్యతిరేకంగా పోరాడిన కోదండరాం ఇవాళ అదే వలస పార్టీలకు వంత పాడుతున్నాడు. తెర వెనుక నడిపించేది అంతా చంద్రబాబు అయినా కోదండరాంను మభ్య పెట్టేందుకు సమన్వయ కమిటీ చైర్మన్ అంటూ ముందుకు తెచ్చారు`` అంటూ హరీష్ రావు వ్యాఖ్యానించారు.
కూటమి ఏ ఉద్దేశంతో ఏర్పాటైందో స్పష్టత ఇవ్వాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. కోదండరాం నిజస్వరూపాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగట్టి వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు గెలిపించుకుంటామని హరీష్ రావు తెలిపారు. కాంగ్రెస్ ఓడిపోయే సీట్లను టీజేఎస్ కు అంటకడుతోందన్నారు. ``ఆనాడు జేఏసీని విచ్ఛిన్నం చేయడానికి కాంగ్రెస్ కుట్రలు చేసింది. కాంగ్రెస్ నాయకులు నాడు చెరుకు సుధాకర్ పై పీడీయాక్ట్ పెట్టి వరంగల్ సెంట్రల్ జైలుకు పంపించారు. ఉద్యమ సమయంలో ఉద్యోగులకు టీఆర్ ఎస్ అండగా నిలిచింది. ఆనాడు ఉస్మానియా విద్యార్థులపై కేసులు పెట్టింది కాంగ్రెస్ అయితే.. బెయిల్ ఇప్పించింది టీఆర్ ఎస్ అని గుర్తు చేశారు. విద్యార్థి నేతలను ఎంపీలు - ఎమ్మెల్యేలుగా గెలిపించుకున్నాం. ప్రొఫెసర్ సీతారాం నాయక్ ను - డాక్టరైన బూర నర్సయ్యగౌడ్ ను ఎంపీలుగా గెలిపించుకున్నాం. కానీ నేడు కాంగ్రెస్ ఏం చేస్తోంది ఉస్మానియా విద్యార్థులకు టికెట్లు నిరాకరించింది. దీంతో ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయంలో టికెట్ల ధర్నా చేస్తున్నారు.`` అని మంత్రి పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో 100 స్థానాల్లో గెలిచి తీరుతామని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు.
తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని అమరావతి - ఢిల్లీకి తాకట్టు పెడుతున్నారని హరీష్ రావు మండిపడ్డారు.``చంద్రబాబు చేతిలో కాంగ్రెస్ నేతలు కీలుబొమ్మలుగా మారారు. పొత్తుల పేరుతో ఏర్పడ్డ కూటమి ముఖ్య ఉద్దేశం ఏమిటో చెప్పాలి. సీఎం కేసీఆర్ ను విమర్శిస్తే సహించేది లేదు. ఉద్యమకారులను గుర్తించి అన్ని పదవుల్లో ప్రాతినిధ్యం కల్పించిన ఏకైక పార్టీ టీఆర్ ఎస్`` అని ఆయన వివరించారు.