టీచరైన హరీష్ రావుకు ఇది షాక్

Update: 2019-12-28 11:23 GMT
తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు శనివారం ఆకస్మాత్తుగా టీచర్ అవతారం ఎత్తారు. సంగారెడ్డి జిల్లా కంది ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేస్తుండగా ఆయనకు అనుకోని షాక్ తగిలింది.

స్థానిక కంది ప్రభుత్వ పాఠశాలను మంత్రి తనిఖీ చేస్తూ పదోతరగతి విద్యార్థులను లేపి ఎక్కాలు చెప్పమని అడిగారు. పదో టేబుల్ వరకూ మాత్రమే వస్తాయని విద్యార్థులు చెప్పడం చూసి టీచర్ల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రిన్సిపల్ ను ఇదేంటని నిలదీశారు.5వ తరగతి విద్యార్థులు పదో టేబుల్ చెబుతారని.. పదో తరగతి విద్యార్థికి 10 టేబుల్ మాత్రమే వస్తాయంటున్నారని ప్రిన్సిపల్ పై సీరియస్ అయ్యారు. ఈ విద్యార్థులు 10వ తరగతి పాస్ అవుతారా? పబ్లిక్ పరిక్షలు ఎలా నెగ్గుతారని ప్రశ్నించారు. ప్రపంచంతో ఎలా పోటీ పడుతారంటూ నిలదీశారు.

ఇక ఆ తర్వాత హైదరాబాద్ లో జరిగిన తెలంగాణ రికగ్నైజెడ్ స్కూల్ మేనేజ్ మెంట్ అసోసియేషన్ కార్యక్రమంలో మంత్రి హరీష్ పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యార్థులు సోషల్ మీడియాకు బానిస అయ్యి చదువులు పక్కనపెడుతున్నారన్నారు. ర్యాంకుల పేరుతో విద్యార్థులను వేధించవద్దని యాజమాన్యాలకు సూచించారు. విద్యార్థులను చిన్నప్పటి నుంచే తీర్చిదిద్దాలని మంత్రి సూచించారు.
Tags:    

Similar News