2015గోదావరి పుష్కరాల్లో అత్యంత విచారకరమైన, విషాదకరమైన విషయం... ఈనెల 14న రాజమండ్రి పుష్కర ఘాట్ లో జరిగిన తొక్కిసలాట! ఈ ఘటనలో 29మంది ప్రాణాలు విడిచారు! ఈ ఘటనపై భిన్న స్వరాలు వినిపించాయి! ఇది ప్రభుత్వం లోపం అని కొందరంటే... అధికారుల చేతకానితనం అని మరికొందరు అన్నారు. ప్రభుత్వానికి - అధికారులకు మధ్య సమన్వయలోపం అని ఇంకొందరు తేల్చారు! అయితే వైకాపా, కాంగ్రెస్ పార్టీలు మాత్రం... చంద్రబాబు షార్ట్ ఫిల్మ్ షూటింగ్ లో భాగంగా జరిగిన తొక్కిసలాటే కారణమని వాదించారు!
అయితే తాజాగా... పుష్కరాల్లోని తొక్కిసలాట జరగడానికి, ఫలితంగా 29 మంది అమాయక భక్తులు మరణించడానికి చంద్రబాబు తన వ్యక్తిగత షార్ట్ ఫిల్మ్ షూటింగే కారణం అని! ఈ షార్ట్ ఫిల్మ్ షూటింగ్ చేస్తున్న సమయంలో...ఒకేసారి జనాలను వదలమని దర్శకుడు బోయపాటి చెప్పడంతో... ఒకేసారి జనాలంతా కదలడంతో తొక్కిసలాట జరిగిందని... అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ తనయుడు జీఈ శ్రీరాజ్ రాజమండ్రి త్రీ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు! ఆ మేరకు పోలీసులు కేసునమోదు చేశారు!
చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, బోయపాటి ఇందుకు సహకరించారనే ఆరోపణలతో వీరిపై ఫిర్యాదు చేశారు! ఇదే క్రమంలో కలెక్టర్, రాజమండ్రి అర్బన్ ఎస్పీలపై న్యాయవిచారణ జరిపి చర్యలు తీసుకోవాలని శ్రీరాజ్ తా ఫిర్యాదులో పేర్కొన్నారు!