డేరా బాబా ఆశ్ర‌మం..ఏడు వింతల నిల‌యం!

Update: 2017-09-07 17:20 GMT
వివాదాస్ప‌ద‌ డేరా సచ్చా సౌధా బాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ లీల‌లు ఒక్కొక్క‌టిగా వెలుగులోకి వ‌స్తున్నాయి. డేరా బాబు ప్రస్తుతం అత్యాచారం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. అయితే డేరా లోపల గుర్మీత్ ఏర్పరుచుకున్న సౌకర్యాలు చూస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే. అంతటి సకల భోగాలు అనుభవించాడు గుర్మీత్. సుమారు 700 ఎకరాల ప్రాంగణంలో ప్రపంచంలోని ఏడు వింతలను ఆవిష్కరించే వ్యూహం రచించాడట. దీనిలో భాగంగా  ఈఫిల్‌ టవర్‌ - తాజ్‌ మహల్‌ - డిస్నీలాండ్‌ ల నమూనాలను సృష్టించాడు. గుర్మీత్‌ డేరాలో ఎంతటి విలాసవంతమైన జీవితం గడిపాడో ఆ ప్రదేశాన్ని వీక్షిస్తే ఇట్టే స్పష్టమవుతుందని అంటున్నారు.

ఇంతేకాకుండా స్పోర్ట్స్‌ విలేజ్‌ - డేరా బాబా సినిమాలు ప్రదర్శించే మహి సినిమా థియేటర్ సైతం డేరాబాబా ఆశ్ర‌మంలో ఉన్న‌ట్లు మీడియా క‌థ‌నాలు వెలువ‌రించింది. ఈ ఇందులో స‌హ‌జంగానే డేరాబాబా చిత్రం ప్ర‌ద‌ర్శితం అవుతోందిది. గుర్మీత్‌ నటించిన జట్టు ఇంజనీర్ సినిమా ప్ర‌స్తుతం ఈ థియేట‌ర్‌లో ప్రదర్శితమవుతోంది. డేరా క్యాంపస్‌ అంతటా లగ్జరీ క్యాసిల్స్‌, రిసార్ట్స్‌, మొఘల్‌ కోర్ట్స్‌తో పాటు  భారీ ఓడ సైతం ప్రాంగణంలో నిలిపి ఉంది. అంతేగాక ఆ ప్రాంగణంలో ఓ పెద్ద ఫిల్మ్ సిటీని కూడా నిర్మించుకున్నాడు. తన సినిమాలన్నీ ఇక్కడే షూటింగ్ చేసుకునేవాడట. అయితే ఫిల్మ్ సిటీలోకి ఎవరికి అనుమతి లేదు. ఎవరూ ప్రవేశించడానికి వీలులేకుండా ఎలక్ర్టిక్‌ వైర్లతో కంచె ఏర్పాటు చేశారు. విదేశీ అనుచరుల కోసం డేరా బాబా ఏకంగా ఇక్కడ అండర్‌ వాటర్‌ విల్లా నిర్మిస్తున్నారు. అద్భుత ఇంజనీరింగ్‌ ప్రమాణాలతో నీటిలోపల భారీ రిసార్ట్‌ను నిర్మించేందుకు బాబా చేసిన ప్లాన్‌ ఆయన అరెస్ట్‌ తో అటకెక్కింది.

పంజాబ్ - హర్యానా హైకోర్టు ఏర్పాటు చేసిన రిటైర్డ్ జడ్జీ నేతృత్వంలో అధికారల ప్రత్యేక బృందం త్వరలోనే డేరాలో తనిఖీలు చేయనుంది. ఈ నేపథ్యంలో డేరా లోపల, బయట భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ తనిఖీల్లో గుర్మీత్ బాబా రహస్యాలు మరిన్ని బయటపడనున్నాయ‌ని అంటున్నారు.
Tags:    

Similar News