ఇప్పటిదాకా మక్కా వెళ్లే ముస్లిం సోదరులకు ప్రభుత్వాలు అండగా నిలుస్తున్నాయి. జెరూసలెం వెళ్లే క్రైస్తవ సోదరులకు కూడా ప్రభుత్వాలు ఉచిత ప్రయాణాన్ని అందిస్తున్నాయి. హిందూ దేశంగా ఉన్న భారత్ లో ఇతర మతాలకు చెందిన భక్తులకు కానుకలు - బహుమతులు అందుతున్నాయి గానీ... హిందువులకు మాత్రం చిల్లిగవ్వంత గిఫ్ట్ లు ఇస్తున్న దాఖలా ఇప్పటిదాకా లేదనే చెప్పాలి. ఏదో ఒక రాష్ట్రంలో ఈ తరహా పథకాలు ఉన్నా... అవేవీ ఇప్పటిదాకా బయటి ప్రపంచానికి తెలియనే లేదని చెప్పాలి. అయినా హిందూ దేశంలో మెజారిటీ వర్గంగా ఉన్న హిందువులకు ప్రభుత్వాల బాసట ఎందుకని కొందరు ప్రశ్నిస్తూనే... మైనారిటీ వర్గాలుగా ఉన్న ముస్లింలు - క్రైస్తవులకు బహుమతులు - కానుకలు ఇవ్వడంలో తప్పేముందని కూడా వాదిస్తున్నారు. అంతెందుకు రిజర్వ్‌డ్ కేటగిరీలుగా ఉన్న వారికి... వారి ఆర్థిక స్తోమతతో సంబంధం లేకుండానే రిజర్వేషన్లు అందుతున్నాయి. అదే జనరల్ కేటగిరీలో ఉన్న వారు నిరుపేదలైనా వారికి రిజర్వేషన్లు అందుతున్న దాఖలా లేదు.
ఈ వాదోపవాదాలు ఎలా ఉన్నా... హిందూ దేశంలో హిందూ భక్తులకు కూడా ముస్లింలు - క్రైస్తవుల మాదిరిగా బహుమానాలు ఎందుకు ఇవ్వకూడదనుకున్నారో, ఏమో తెలియదు గానీ... బీజేపీలో మిస్లర్ క్లీన్ గా రికార్డులకెక్కిన హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఇప్పుడు ఓ కొత్త పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. వచ్చే ఏడాది నుంచి అమలులోకి రానున్న ఈ పథకాన్ని ఆయన ఇప్పుడే ప్రకటించేశారు కూడా. ఆ పథకం వివరాల్లోకెళితే... కాశీ యాత్రకు వెళ్లే హిందూ భక్తులకు ఉచిత ప్రయాణాన్ని అందించేందుకు హర్యానా సర్కారు సమాయత్తమవుతోంది. వచ్చే ఏడాది నుంచి ఏటా 5 వేల మందికి ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ గా ముందుగా దరఖాస్తు చేసుకున్న వారికి తమ కోటాకు లోబడి కాశీ యాత్రకు ఉచిత ప్రయాణ టికెట్లను అందజేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఇదిలా ఉంటే... ఖట్టర్ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత హర్యానాలో హిందూ అనుకూల కార్యకలాపాలకు పెద్ద ఎత్తున నిధులను వెచ్చిస్తున్నారని ఆరోపణలు ఇప్పటికే వినిపిస్తున్నా... ఖట్టర్ మాత్రం సదరు ఆరోపణలను ఏమాత్రం లెక్క చేయకుండానే ఇప్పుడు కాశీ యాత్ర పేరిట కొత్త పథకాన్ని ప్రవేశపెట్టడం గమనార్హం.
హర్యానాలోని కురుక్షేత్రలో కోట్ల రూపాయల ప్రజాధనంతో అంతర్జాతీయ గీతా జయంతి మహోత్సవం నిర్వహిస్తుందని విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో పాట్నాలో జరిగిన గురుగోవింద్ సింగ్ ఉత్సవాలకు హర్యానా బీజేపీ సర్కారు రెండు ప్రత్యేక రైళ్లను సర్కారీ నిధులతో ఏర్పాటు చేసింది. ఈ తరహా కార్యక్రమాలపై ఓ వైపు విపక్షాలన్నీ విరుచుకుపడుతున్నా ఖట్టర్ మాత్రం తాను అనుకున్న రీతిలో ముందుకు దూసుకుపోతున్నారనే చెప్పాలి. ఇక ఈ తరహా పథకాల విషయానికి వస్తే... పంజాబ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి తీర్థ దర్శనయాత్ర పథకం పేరిట ప్రత్యేక రైళ్లకు రూ.139 కోట్లు వెచ్చిస్తోంది. ఈ పథకాన్ని పరిశీలించిన తర్వాతే ఖట్టర్ హర్యానాలో కాశీ యాత్ర పేరిట కొత్త పథకాన్ని ప్రకటించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.