వివాదాస్పదమా... హాస్యాస్పదమా ఖాన్ జీ!

Update: 2016-09-21 13:28 GMT
చాలా మందికి ఒక అలవాటు ఉంటుంది. తాను లేని చోట - చేరుకోలేని స్థానంలో వేరే వాళ్లు కూర్చున్నప్పుడు.. "నేను గనుక ఆ స్థానంలో ఉండి ఉంటేనా?" అని మాట్లాడుతూ జనాల్ని ఇబ్బంది పెడుతూ, ఆత్మవంచన చేసుకుంటూ ఉంటారు. ఇదే కోవలోకి వచ్చే ప్రయత్నమో ఏమో కానీ.. నిత్యం వివాదస్పద వ్యాఖ్యలు చేసే నేతగా పేరున్న సమాజ్ వాది పార్టీ లీడర్ అజమ్ ఖాన్ దాదాపు ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. తనను ప్రధానిని చేస్తే.. దేశాన్ని ఎలా పరిపాలించాలో చేసి చూపిస్తాను అని.. తాను ముస్లింని కావడమే తాను ప్రధాని అవ్వడానికి గల ప్రధాన అడ్డంకి అని వ్యాఖ్యానించి సంచలన వ్యాఖ్యలు చేసే క్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు!

తనకు ప్రధానిగా అయ్యే లక్షణాలన్నీ పుష్కలంగా ఉన్నాయని.. కానీ తాను ముస్లిం కావడం వల్లే ఆ అవకాశం లేకుండా పోతుందని.. తనను ప్రధానిగా చేస్తే దేశాన్ని ఎలా పరిపాలించాలో చేసి చూపిస్తానని చెప్పుకొస్తున్నారు అజమ్ ఖాన్. చదువు, అనుభవం, నిజాయితీ, నిర్వహాణలో నైపుణ్యం వంటి లక్షణాలు అన్నీ తనకున్నాయని.. తాను ముస్లిం కావడమే లోపం తప్ప మరే ఇతర కారణాలు లేవని అంటున్నారు. తనను ప్రధానిగా చేసిన ఏడాది లోపే కశ్మీర్‌ సమస్యను ఓ కొలిక్కి తీసుకొస్తానని.. అఖండ భారత్‌ గా దేశాన్ని తీర్చిదిద్దుతానని అజమ్ ఖాన్ చెబుతున్నారు. వీటిని వివాదాస్పద వ్యాఖ్యలు అని కొందరంటుంటే... అంత లేదు, కేవలం హాస్యాస్పద వ్యాఖ్యలే అని మరికొందరు లైట్  తీసుకుంటున్నారు. భారతదేశంలో ఉన్నత స్థానానికి వెళ్లడానికి ముస్లిం అనే విషయం ఒక సమస్యా ఖాన్ జీ.. మీది అమాయకత్వమో, అజ్ఞానమో అర్ధంకావడంలేదని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
Tags:    

Similar News