రోహిత్ సూసైడ్ నోట్ లో ఎవరి పేర్లు లేవు

Update: 2016-01-20 12:40 GMT
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పీహెచ్ డీ విద్యార్థి రోహత్ ఆత్మహత్య వ్యవహారంలో చట్టబద్ధంగా వ్యవహరిస్తామని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ స్పష్టం చేశారు. రోహత్ సూసైడ్ నోట్ లో ఎవరి పేర్లు లేవని.. ఎవరి మీదా ఆరోపణలు చేయలేదని.. తన మరణానికి కారణాలు రాయలేదన్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు. రోహిత్ ఆత్మహత్య విచారకరమంటూ విద్యార్థి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

రోహత్ ఆత్మహత్య దళితులు.. దళితేతరుల సమస్య ఎంతమాత్రం కాదని.. కొందరు ఈ వ్యవహారాన్ని వక్రీకరించి రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. రోహిత్ ఆత్మహత్యపై నిష్పక్షపాతంగా విచారణ జరుగుతుందని చెప్పారు. నిజ నిర్దారణ కమిటీ బుధవారం సాయంత్రానికి ఢిల్లీకి చేరుకుంటుందని.. కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు.

హెచ్ సీయూ ఘటనలో కేంద్రం జోక్యం లేదని స్మృతి తేల్చి చెప్పారు. విద్యార్థుల్ని హాస్టల్ ఖాళీ చేయాలని చెప్పింది దళిత వార్డెనే అన్న విషయాన్ని కేంద్రమంత్రి చెప్పటం గమనార్హం. పీహెచ్ డీ విద్యార్థుల సస్పెన్షన్ పై హైకోర్టు సైతం స్టే ఇచ్చేందుకు నిరాకరించిందన్న విషయాన్ని మర్చిపోకూడదని చెప్పటం విశేషం. ఇక.. రోహత్ కుల వివాదంపై నెలకొన్న రగడపై విచారణ జరుగుతుందని స్పష్టం చేశారు.
Tags:    

Similar News