ప్రేమించిన అమ్మాయితో సహజీవనం చేస్తూ.. పెళ్లి చేసుకుందామని ఒత్తిడి తెచ్చినందుకు ఢిల్లీలో ప్రియురాలిని చంపేయటమే కాదు.. దారుణంగా ఆమె శరీరాన్ని భాగాలుగా కోసేసి.. ఫ్రిజ్ లో దాచి.. రోజుల తరబడి వాటిని ఢిల్లీ వీధుల్లో విసిరేసిన ఉదంతం సంచలనంగా మారటం తెలిసిందే. ‘శ్రద్ధా’ ఉదంతం ఒక కొలిక్కి రాక ముందే.. ఉత్తరప్రదేశ్ లో మరో ఉదంతం చోటు చేసుకుంది. ఇందులోనూ ప్రేమించిన ప్రియురాలిని మతం మారాలన్న ప్రియుడి మాటకు నో చెప్పినందుకు ప్రాణాలు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి. మరో సంచలనంగా మారిన ఈ ఉదంతంలోకి వెళితే..
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నోలోని వసంత్ విహార్ లో సూఫియాన్.. నిది గుప్తాలు నివాసం ఉంటున్నారు. బ్యూటీషియన్ గా శిక్షణ పొందిన నిధి.. సూఫియాన్ ప్రేమలో పడింది. వారిద్దరు కొన్ని నెలలుగా ప్రేమలో ఉన్నారు. అయితే.. తాను ప్రేమించిన నిధిని ఇస్లాంలోకి మారాలంటూ సూఫియాన్ కొంతకాలంగా ఒత్తిడి చేయటంతో నిధి అందుకు నో చెప్పింది. దీంతో.. వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి. అతడి తీరు నచ్చని నిధి అతడికి దూరంగా ఉంటోంది.
అయినప్పటికీ సూఫియాన్ ఆమెను వెంటాడటంతో ఆమె ఇంట్లో విషయాన్ని చెప్పేసింది. దీంతో.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇరు వర్గాల వారిని పిలిచిన పోలీసులు.. వారికి సర్దిచెప్పి రాజీ చేసి పంపారు. అయినప్పటికీ.. తన కుమార్తెకు సూఫియాన్ తరచూ ఫోన్లు చేస్తున్నారన్నది నిధి తల్లిదండ్రుల వాదన. దీంతో.. అతడి కుటుంబంతో మాట్లాడేందుకు నిధిగుప్తా తల్లిదండ్రులు.. వారి బంధువులు సూఫియాన్ ఇంటికి వెళ్లారు. అయితే.. సూఫియాన్ ఇంటి వారు తమపై దాడికి దిగినట్లుగా నిధి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. మాట్లాడేందుకు వెళ్లిని నిధి తల్లిదండ్రులపై సూఫియాన్ కుటుంబీకులు విరుచుకుపడటం.. అక్కడే ఉంటే నిధి మామయ్య కారును తగలబెట్టేస్తానంటూ సూఫియాన్ వార్నింగ్ ఇవ్వటంతో.. అతడితో మాట్లాడేందుకు నిది నాలుగో అంతస్థులోకి వెళ్లింది.
కోపంతో ఉన్న సూఫియాన్ ఆమెను నాలుగో అంతస్తు నుంచి కిందకు తోసేశాడు. దీంతో.. ఆమె అక్కడి నుంచి కింద పడటంతో అక్కడికక్కడే మరణించారు. పెద్దగా అరుపులు.. శబ్ధం రావటంతో అక్కడికి వెళ్లిన నిధి తల్లిదండ్రులకు ఆమె విగతజీవిగా పడి ఉన్న వైనంతో షాక్ తిన్నారు.
ఈ పరిణామంతో సూఫియాన్.. అతడి తల్లిదండ్రులు అక్కడి నుంచి పరార్ అయ్యారు. కేసునమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఉదంతం ఇప్పుడుపెను సంచలనంగా మారింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.