ఈ 'ఆకు తిను'.. సంతానం పక్కా..

Update: 2019-09-27 06:01 GMT
సంతానం లేదని బాధపడే దంపతులు ఎంతో మంది ఉంటారు. ముఖ్యంగా ఈ ఉరకుల పరుగుల జీవితంలో ఒత్తిడితో కూడిన ఉద్యోగాల వల్ల - గాలి కాలుష్యం వల్ల పురుషుల్లో వీర్యకణాల సంఖ్య భారీగా పడిపోతోంది.. దీంతో వారికి స్పెర్మ్ కౌంట్ (వీర్య కణాల సంఖ్య) తగ్గిపోయి పిల్లలు పుట్టడం లేదు. ఇది ప్రస్తుత సమాజంలో అతిపెద్ద సమస్యగా మారింది. దీనికోసం వైద్యుల వద్ద లక్షలు ఖర్చు పెట్టే పరిస్థితి నెలకొంది. వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉంటే సమాజంలో చులకన.. భార్యతో లైంగిక సంబంధం సరిగా చేయలేని పరిస్థితి కనిపిస్తోంది.

అయితే వైద్యచికిత్సల ద్వారా వీర్యకణాల వృద్ధి అనేది ప్రహసనంతోపాటు ఖర్చుతో కూడుకున్నది. కానీ మన సనాతన ఆయుర్వేదంలో దీనికి ఒక ఆకు దివ్యౌషదంగా తేలింది. పరిశోధనల్లో వీర్యకణాల వృద్ధిని ఈ చెట్టు ఆకు అద్భుతంగా పనిచేస్తుందని తేలింది.. అదే ‘జామ ఆకు’.

జామ ఆకును డైరెక్ట్ గా నమిలి తినడం వల్ల లేదా పానీయంగా తీసుకోవడం వల్ల వీర్యకణాల ఉత్పత్తి బాగా పెరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తక్షణమే స్పెర్మ్ కౌంట్ ను పెంచుతుందని చెబుతున్నారు. అంతేకాదు.. జామ ఆకు వల్ల మన శరీరానికి చాలా ఉపయోగం అని పరిశోధనల్లో తేలింది.

జామా ఆకులో ఉండే యాంటి ఆక్సిడెంట్లు మనకు రోగనిరోధకశక్తిని పెంచుతాయి. చెడు కొవ్వును తొలగించి మంచి కొవ్వుతో సరైన బరువును నియంత్రిస్తుంది. జీవక్రియలను సజావుగా చేస్తుందట.. జామ ఆకుల టీ తీసుకుంటే జీర్ణ సమస్యలు మటుమాయమేనట.. జామ ఆకుల టీని మూడు నెలలు వాడితే క్యాన్సర్ - చికాకులు - దురద తగ్గుతుందట.. అతిసారం - విరేచనాలు - జ్వరం - గొంతు సమస్యలు, ఇతర వ్యాధులను నయం చేస్తుందని పరిశోధనల్లో తేలింది. సో ఇప్పటికైన ఇన్నీ దివ్య ఔషధాలు కలిగిన జామ ఆకును వాడి మీ వీర్యకణాల వృద్ధితోపాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
    

Tags:    

Similar News