కరోనా సోకిన వారిలో కొత్త అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. కరోనా మహమ్మారి నుండి పోరాడి ప్రాణాలతో బయటపడ్డాం అనుకుంటున్న సమయంలో వారిలో తీవ్ర అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కరోనా వైరస్ నుంచి కోలుకున్న వారిలో కొత్తగా ఇప్పుడు వినికిడి లోపం కనిపిస్తుందని , కరోనా సోకి పోరాడి బయటపడిన వారు చాలామంది వినికిడి కోల్పోయినట్టు గుర్తించారు. అలాగే వాసన, రుచిని కోల్పవడం వంటి సమస్యలు అధికమవు తున్నాయని అంటున్నారు. మాంచెస్టర్ యూనివర్శిటీ నిపుణులు వైరస్ నుంచి కోలుకున్న వ్యక్తులు వినికిడి క్షీణతతో పాటు టిన్నిటస్ వంటి అనారోగ్య సమస్యలను గుర్తించామని నివేదించారు.
కరోనా నుండి కోలుకున్న తర్వాత పదిమందిలో ఒకరు రుచి లేదా వాసనను శాశ్వతంగా కోల్పోతారని ఇటాలియన్ రోగుల పరిశోధన వెల్లడించిన కొద్ది రోజుల్లోనే ఈ కొత్త సమస్య వెలుగులోకి వచ్చింది. మాంచెస్టర్ యూనివర్శిటీలోని ఆడియాలజిస్టుల అభిప్రాయం ప్రకారం.. వైరస్ నుంచి కోలుకునేవారికి కూడా వినికిడి సమస్యలు తలెత్తవచ్చునని అన్నారు.ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన 8 వారాల తర్వాత వారిని ఫోన్ ద్వారా పలు అంశాలపై ప్రశ్నించారు. మీలో ఎవరికైనా వినికిడిలో ఏమైనా మార్పులు ఎదురయ్యాయా అని అడిగినప్పుడు 13.2 శాతం మంది వినికిడి కోల్పోయామని తెలిపారు.
ఈ వైరస్ కారణంగా చెవి లేదా కోక్లియాతో సహా వినికిడి వ్యవస్థ భాగాల్లో సమస్యలను కలిగించే అవకాశం ఉంది. అడిటరీ న్యూరోపతి, కోక్లియా చెప్పిన ప్రకారం.. నాడి వెంట మెదడుకు ప్రసారం బలహీనంగా మారుతుందని తెలిపారు. అడిటరీ న్యూరోపతి సమస్యలతో బాధపడేవారిలోనూ వినికిడి సమస్యలు వస్తాయి. పెద్ద పెద్ద శబ్దాలు వచ్చే చోట వారికీ కొంత సమస్య ఏర్పడవచ్చు. కరోనా వైరస్ తో పాటు ఇతర అనారోగ్య పరిస్థితులు ఆందోళనకరంగా ఉండొచ్చు. ఫేస్ మాస్క్ ధరించడం, కరోనా ట్రీట్ మెంట్ వినియోగించే మందులు, చెవికి హని కలిగించే లేదా ఒత్తిడి వంటి తీవ్రమన అనారోగ్య సమస్యలు ఉంటాయని హెచ్చరించారు.