వ‌రుస వాన‌ల‌తో ముంబ‌యి అలా మారింద‌ట‌!

Update: 2019-07-01 06:08 GMT
మ‌న ద‌గ్గ‌రేమో వాన‌లు ముఖం చాటేసిన పరిస్థితి. ఇరుగున ఉన్న ముంబ‌యిలో మాత్రం అందుకు భిన్నంగా శుక్ర‌వారం నుంచి విడ‌వ‌కుండా వాన‌లు ప‌డుతూనే ఉన్నాయ‌ట‌. మ‌బ్బుల దుప్ప‌టి నిండుగా క‌ప్పేసిన నేప‌థ్యంలో విడ‌వ‌కుండా ప‌డిన వాన‌తో దేశ ఆర్థిక రాజ‌ధాని త‌డిచి ముద్దైన‌ట్లుగా చెబుతున్నారు.

వ‌రుస వాన‌ల‌తో ఇప్పుడు ముంబ‌యి మ‌హాన‌గ‌రంలో ఎక్క‌డ చూసినా వ‌ర్షపునీరేన‌ని.. రోడ్ల మీద నిలిచిన నీటితో ప్ర‌జ‌లు తెగ ఇబ్బందికి గురి అవుతున్న‌ట్లు చెబుతున్నారు. రోడ్ల మీద వ‌ర్ష‌పు నీరు నిలిచిపోవ‌టంతో వాహ‌నాల రాక‌పోక‌ల‌కు తీవ్ర అంత‌రాయం ఏర్ప‌డుతోంద‌ని.. ట్రాఫిక్ జాంలు ఎక్కువైన‌ట్లు చెబుతున్నారు.

పైపులు పెట్టి మ‌రీ బృహ‌న్ ముంబ‌యి మున్సిప‌ల్ కార్పొరేష‌న్ నీళ్ల‌ను తొల‌గిస్తున్నా.. ప‌రిస్థితి మాత్రం అదుపులోకి రావ‌టం లేదంటున‌నారు. కుర్లా.. సీఎస్టీ ప్రాంతాల్లోని రోడ్లు చిన్న‌సైజు న‌దుల మాదిరి మారిన‌ట్లు చెబుతున్నారు. ఈ వ‌ర్షం కార‌ణంగా ముంబ‌యి మ‌హాన‌గ‌రంలో విద్యుత్ స‌ర‌ఫ‌రాలోకూడా అంత‌రాయం ఏర్ప‌డింద‌ని.. దీంతో న‌గ‌ర ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందుల‌కు గుర‌వుతున్నార‌ట‌.

ఇక‌.. శివారులో కురుస్తున్న భారీ వ‌ర్షం కార‌ణంగా లోత‌ట్టు ప్రాంతాల్లోని ప్ర‌జ‌లకు మ‌హా క‌ష్టంగా మారింద‌ట‌. ఇదిలా ఉంటే.. ఈ వ‌ర్ష తీవ్ర‌త కార‌ణంగా ప‌లు రైళ్లు కూడా ర‌ద్దు అయ్యాయి. ప‌ట్టాల మీద‌కు నీళ్లు చేర‌టంతో రైళ్ల‌ను న‌డ‌ప‌టం ఇబ్బందిగా మారింది. ఇప్ప‌టివ‌ర‌కూ 10 రైళ్ల‌ను వ‌ర్షాల కార‌ణంగా ర‌ద్దు చేయ‌గా.. మ‌రో నాలుగు రైళ్లు దారి మ‌ళ్లించారు. ఇప్ప‌టికే ఒక గూడ్సు రైలు ప‌ట్టాలు త‌ప్పింది. లోక‌ల్ రైళ్లు సైతం ఆల‌స్యంగా న‌డుస్తున్నాయి. ఇప్ప‌టికైతే.. పాడు వ‌ర్షం వ‌ద్ద‌నే వ‌ద్దు.. వెంట‌నే సూరీడు రావాల‌ని ముంబ‌యివాసులు గ‌ట్టిగానే కోరుకుంటున్నార‌ట‌.



Tags:    

Similar News