హేమామాలిని పై ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

Update: 2017-04-14 09:55 GMT
ప్రజాప్రతినిధుల నోటికి అడ్డుకట్ట ఉండడం లేదు. ఇతర ప్రజాప్రతినిధుల వ్యక్తిగత అంశాల గురించి కూడా బహిరంగ వేదికలపై మాట్లాడేస్తున్నారు. తాజాగా మహారాష్ర్టకు చెందిన ఓ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే కూడా ఇలాగే బీజేపీ ఎంపీ హేమామాలినికి ఉన్న అలవాట్ల గురించి, మహారాష్ట్ర లోని ఇతర ఎమ్మెల్యేల గురించి మాట్లాడి విమర్శలు ఎదుర్కొంటున్నారు.
    
75 శాతం ఎమ్మెల్యేలు రోజూ మందు కొడతారని.. అలాగే బీజేపీ ఎంపీ హేమామాలిని కూడా రోజూ మందుకొడతారని మహారాష్ర్టకు చెందిన ఇండిపెండెంట్ ఎమ్మెల్యే బచ్చు కదూ వ్యాఖ్యానించారు. కేవలం మద్యం తాగుడుకు అలవాటు పడటం వల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ప్రభుత్వాలు వ్యాఖ్యానించడాన్ని తప్పు పడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.  రోజూ మద్యం తాగే ఎమ్మెల్యేలు కానీ - జర్నలిస్టులు కానీ - హేమమాలిని కానీ ఆత్మహత్య చేసుకుంటున్నారా అని ఆయన ప్రశ్నించారు.
    
మహారాష్ట్రలో మద్యం దుకాణాలపై ఆంక్షలు సరికాదని, మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై కఠిన చర్యలు తీసుకుంటే చాలని అన్నారు. మద్యానికి బానిసలవడం వల్లే రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ప్రభుత్వాలు ప్రకటించడంపై ఆయన మండిపడ్డారు.   వివాహాలకు అధిక ఖర్చు చేసి అప్పుల పాలవడం వల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పడం కూడా కరెక్ట్ కాదన్నారు. అలా అయితే కేంద్ర మంత్రి గడ్కరి ఏకంగా కోట్లు ఖర్చు చేసి కుమారుడి పెళ్లి చేశారని.. కాబట్టి ఆయన ఎప్పుడు ఆత్మహత్య చేసుకుంటారో అన్న భయం ఏమైనా ఉందా అన్నారు.
    
రైతుల ఆత్మహత్యలపై ప్రభుత్వం చెబుతున్న కారణాలన్నీ అవాస్తవాలన్నారు.  రైతులకు ఆదాయం రాకపోవడం వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నారని బాచు కడు అభిప్రాయపడ్డారు.  ప్రొఫెసర్‌ స్వామినాథన్ కూడా వ్యవసాయ ఉత్పత్తి పెరిగిందే గానీ రైతులు ఆదాయం పెరగలేదని చెప్పిన విషయాన్ని కూడా బాచు కడు గుర్తు చేశారు. నిజానికి ఈ ఎమ్మెల్యే మాటల్లో వాస్తవం ఉన్నప్పటికీ ఆయన మాట్లాడిన తీరు కారణంగా అసలు విషయం పక్కకపోయి ఇతరుల గురించి మాట్లాడిన విషయాలు హైలైట్ అయిపోయాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News