గౌతం గంభీర్ సెక్యూలర్ వాది.. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా గెలిచేవరకు ఆయన హిందుత్వాన్ని వ్యతిరేకించారు. ఓ ముస్లిం యువకుడిపై గుర్గామ్ లో అల్లరిమూకలు దాడి చేసి జైశ్రీరాం అంటూ కొట్టడాన్ని ప్రశ్నించారు. దీనిపై సీరియస్ గా స్పందించి వార్తల్లో నిలిచారు. ఇకపై కులం, మతం పేరిట జరిగే దాడులన్నింటిపై గళమెత్తుతానని గంభీర్ ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు. దేశం లౌకికత్వంగా ఉండాలని క్లాస్ పీకారు.
అయితే అనూహ్యంగా బీజేపీ ఆహ్వానాన్ని మన్నించి ఆ పార్టీలో చేరి ఎంపీగా గెలిచారు. అమిత్ షా సమక్షంలో బీజేపీ చేరడంతో ఈ లౌకికవాది.. హిందుత్వ వ్యతిరేక మూలాలున్న గంభీర్ ఆ పార్టీలో ఎలా ఇముడుతాడని అందరూ సంశయించారు. ఓ నెటిజన్ అయితే బీజేపీలో జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్ యూ) (హిందూ వ్యతిరేక అతివాద గ్రూపుల నిలయం) గ్రూప్ నాటిన మొక్క గంభీర్ అంటూ ఘాటుగా ట్వీట్ చేశారు. ముస్లిం యువకుడిని కొట్టినందుకు ట్వీట్ చేసిన గంభీర్.. మధురలో 20 మంది ముస్లింలు ఒక హిందువును కొట్టి చంపినప్పుడు ఎక్కడికి పోయావు్ అంటూ ట్వీట్ లో ప్రశ్నించారు.
ఈ ట్వీట్ ను తాజాగా దక్షిణాది తమిళ నటుడు సిద్ధార్త్ రీట్వీట్ చేశారు. గంభీర్ బాయ్.. దేశభక్తులు మిమ్మల్ని జేఏన్ యూ గ్రూప్ బీజేపీలో నాటిన మొక్క అంటున్నారని.. నూతన భారత్ కోసం మీరు పోరాడుతున్నారని.. ఆల్ ది బెస్ట్ అంటూ దెప్పిపొడిచారు. బీజేపీలో హిందుత్వమే చెల్లుతుంది. అలాంటి బీజేపీలో చేరి లౌకికత్వంపై గంభీర్ ఎలా పోరాడుతారని సిద్ధార్త్ ప్రశ్నించడం చర్చనీయాంశమవుతోంది.