సైనాకు హీరో సిద్ధార్ధ్‌ బ‌హిరంగ క్ష‌మాప‌ణ‌

Update: 2022-01-12 05:30 GMT
బ్యాడ్మింట‌న్ స్టార్ సైనా నెహ్వాల్ పై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన హీరో సిద్ధార్థ్ పై స‌ర్వ‌త్రా విమ‌ర్‌శ‌లు వెల్లువెత్తుతున్న విష‌యం తెలిసిందే. దీంతో సిద్ధార్థ్ ఎట్ట‌కేల‌కు దిగొచ్చారు. త‌ను జోక్ చేశాన‌ని, దాని వ‌ల్ల బాధ‌ప‌డివుంటే త‌న‌ని క్ష‌మించాల‌ని బ‌హిరంగ క్ష‌మాప‌ణ చెప్ప‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. వివ‌రాల్లోకి వెళితే.. భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ పంజాబ్ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ఫ్లైఓవ‌ర్ పై 20 నిమిషాల పాటు కాన్వాయ్ స్థంభించిపోవ‌డంతో దేశ వ్యాప్తంగా పంజాబ్ ప్ర‌భుత్వం పై విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి.

ప్ర‌ధాని భ‌ద్ర‌తా సిబ్బందితో పాటు పంజాబ్ ప్ర‌భుత్వం, అక్క‌డి పోలీసుల వ్య‌వ‌హార శైలిపై దేశం మొత్తం చ‌ర్చ జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌పై బ్యాడ్మింట‌న్ స్టార్ సైనా నెహ్వాల్ స్పందించింది. మోదీకి అనుకూలంగా మాట్లాడుతూ పంజాబ్ ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శిస్తూ ఆమె ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ పై హీరో సిద్ధార్థ్ సెటైర్ వేశారు. సెటిల్ కాక్ ఛాంపియ‌న్ షిప్ అంటూ హ‌ద్దులు దాటి కామెంట్ చేశాడు. ద్వందార్థం వ‌చ్చేలా సిద్ధార్థ్ చేసిన ట్వీట్ వివాదంగా మారింది. ఈ ట్వీట్ పై చాలా మంది కౌంట‌ర్ లు వేశారు. జాతీయ మ‌మిళా క‌మీష‌న్ కూడా రంగంలోకి దిగింది.  

దీంతో దిగొచ్చిన సిద్ధార్థ్ త‌ను త‌ప్పు చేశాన‌ని సైనాకు బ‌హిరంగంగా క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. అన్ని వ‌ర్గాల నుంచి సిద్ధార్థ్ తీరుపై విమ‌ర్శ‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో త‌ను త‌ప్పు చేశాన‌ని తెలుసుకున్నాడు. సైనా నెహ్వాల్ కు క్ష‌మాప‌ణ‌లు చెబుతూ సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ ద్వారా బ‌హిరంగ లేఖని విడుద‌ల చేశాడు. `డియ‌ర్ సైనా.. నా ట్వీట్ ద్వారా చేసిన రూడ్ జోక్ కి క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌నుకుంటున్నా. మిమ్మ‌ల్ని కించ‌ప‌ర‌చాల‌నే ఉద్దేశం నాకు ఏ మాత్రం లేదు. మిమ్మ‌ల్ని అవ‌మానించాల‌ని ఆ ట్వీట్ చేయ‌లేదు.

నేను ఒక జోక్ చేశాను. అది త‌ప్పుగా పోట్రేట్ అయింది. ఆ విష‌యంలో న‌న్ను క్ష‌మించండి. నా ఉద్దేశ్యంలో ఎలాంటి త‌ప్పు లేకున్నా కొంద‌రు దాన‌ని త‌ప్పుగా చూపి నా మీద విమ‌ర్శ‌లు చేశారు. మ‌హిళ‌లు అంటే నాకు ఎంతో గౌర‌వం. నా ట్వీట్ లో జెండ‌ర్ కు సంబంధించిన విష‌యాలేవీ లేవు. నా క్ష‌మాప‌ణ‌లు అంగీక‌రిస్తావ‌ని కోరుకుంటున్నా` అని సిద్దార్థ్ విజ్ఞ‌ప్తి చేశారు. అంతే కాకుండా నువ్వు ఎప్పుడూ నా ఛాంపియ‌న్ గా వుంటావు అంటూ లేఖ‌లో పేర్కొన్నాడు.

ప్ర‌స్తుతం సిద్ధార్థ్ మంగ‌ళ‌వారం అర్థ్రా రాత్రి పోస్ట్ చేసిన ఈ లేఖ నెట్టింట వైర‌ల్ గా మారింది. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ పంజాబ్ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా చోటుచేసుకున్న భ‌ద్ర‌తా వైఫ‌ల్యంపై `దేశ ప్ర‌ధానికే భ‌ద్ర‌త లేకుంటే సామాన్యుల ప‌రిస్థితి ఏంటీ? .. ఇలాంటి ప‌రిణామాల్ని ఖండిస్తున్నా` అంటూ సైనా నెహ్వాల్ ట్వీట్ చేసింది. దీనిపై హీరో సిద్ధార్థ్ వ్యంగ్యంగా బ‌దులిస్తూ ` ఓ చిన్న కాక్ తో ఆడే ప్ర‌పంచ ఛాంపియ‌న్‌` అంటూ సైనాపై అభ్యంత‌ర‌క‌ర రీతిలో ట్వీట్ చేయ‌డం వివాదానికి దారితీసింది.
Tags:    

Similar News