మోడీ అంటే మండిపడే వర్గం ఒకటి ఆ మధ్యన మొదలైన సంగతి తెలిసిందే. సినీ నటుడిగా అందరికి సుపరిచితమై.. సామాజిక అంశాలపై తరచూ తన వాదనను వినిపించే సినీ నటుడు శివాజీ. ఏపీకి ప్రత్యేక హోదా మీద గడిచిన కొంతకాలంగా ఉద్యమం చేస్తున్నారు. ఇందులో భాగంగా నిరసనలు.. దీక్షలు చేస్తున్న ఆయన తాజాగా గురువారం రాత్రి 7 గంటల నుంచి ఈ రోజు (శుక్రవారం) ఉదయం 7 గంటల వరకూ జాగారం చేశారు.
ఇంతకీ ఆయన జాగారం ఎందుకు చేశారో తెలుసా? మరో 24 గంటల వ్యవధిలో కర్ణాటకలో జరిగే ఎన్నికల కోసం కావటం గమనార్హం. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలు కావటంతో పాటు.. ఏపీకి ప్రత్యేక హోదా రావాలన్న ఉద్దేశంతో తాను జాగారం చేసినట్లుగా శివాజీ పేర్కొన్నారు.
కర్ణాటక ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయొద్దని.. జేడీఎస్ న నమ్మాల్సిన పని లేదని పేర్కొన్నారు. ఎనిమిది మంది అవినీతిపరులకు బీజేపీ సీట్లు ఇచ్చినట్లు విమర్శించిన శివాజీ.. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో అబద్ధాల పుట్టగా అభివర్ణించారు. తెలుగువారంటే మోడీకి చిన్నచూపని ఆరోపించిన శివాజీ.. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయొద్దని కోరారు.
పవన్ కల్యాణ్ పోరాడితే ప్రత్యేకహోదా వస్తుందన్న ఆయన.. విమర్శలతో ఉపయోగం లేదన్నారు. హోదా కోసం అందరూ కలిసి పోరాడాల్సిందేనని.. ఒకే తాటి మీదకు రావాలన్నారు. మరి.. శివాజీ చేపట్టిన జాగారం కర్ణాటకలోని తెలుగువారికి ఎంతమేర రీచ్ అయ్యిందో.. కర్ణాటక ఫలితాల వరకూ వేచి చూస్తే కానీ తేలదు.