రెండు తెలుగు రాష్ట్రాలకు తలంటిన హైకోర్టు

Update: 2015-08-07 07:06 GMT
విడిపోయి కలిసి ఉంటామన్న మాటకు ఏ మాత్రం సంబంధం లేకుండా.. నిత్యం ఉప్పు నిప్పులా కొట్టుకునే రెండు తెలుగు రాష్ట్ర సర్కార్లకు తాజాగా హైకోర్టు తలంటింది. రెండు రాష్ట్రాల మధ్యనున్న వివాదాల్ని పక్కన పెట్టి.. విద్యార్థుల గురించి ఆలోచించాలంటూ హితవు పలికింది.

తెలంగాణలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సటీకి సంబంధించి ఏపీలోని 13 జిల్లాల్లో సేవలు ఆపివేయటంపై పత్రికల్లో వచ్చిన వార్తను సుమోటోగా స్వీకరించిన హైకోర్టు బుధవారం దానిపై విచారించింది.

ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలు తమ మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టి విద్యార్థుల సంక్షేమం కోసం కలిసి పని చేయాలని పేర్కొంది. ఈ కేసు విచారణ సందర్భంగా రెండు రాష్ట్రాలకు చెందిన న్యాయవాదులు వాదించారు.

విభజన చట్టం ప్రకారం.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఏడాది వారకు రెండు రాష్ట్రాల్లోని విద్యార్థులకు సేవలు అందాంచామని.. అందుకయ్యే ఖర్చులన్నీ తెలంగాణ సర్కారే భరించిందని పేర్కొంది. ఏపీలోని 13 జిల్లాల్లో 93 కేంద్రాల్లోని శాశ్విత.. తాత్కలిక సిబ్బందికి సంబంధించిన జీతభత్యాల్ని తెలంగాణ సర్కారే చెల్లించిందని.. చట్టం ప్రకారం ఏడాది తర్వాత తెలంగాణ ప్రభుత్వంతో ఏపీ సర్కారు ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉందని.. కానీ.. ఏపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని.. కాంటాక్ట్ కు సంబంధించి లేఖ రాసినా వారి నుంచి స్పందనలేదని పేర్కొంది.

దీనిపై స్పందించిన ధర్మాసనం మీ రాష్ట్రంలో 3.5లక్షల మంది ప్రభావితమయ్యే అంశంపై మీరు ఎందుకు మౌనంగా ఉన్నారెందుకు? అని ప్రశ్నించటమే కాదు.. తమకు 500 పైగా లేఖలు ఇదే అంశానికి సంబంధించి వచ్చాయని.. వారెంత ఆందోళన చెందుతున్నారో మీకు తెలుసా అంటూ ఏపీ ఏపీ ఏజీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

దీనిపై స్పందించిన ఆయన.. ఈ అంశానికి సంబంధించి వ్యాజ్యం సుప్రీంలో ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం స్పందిస్తూ.. పదో షెడ్యూల్ లోని అంశాల వివాల్లోకి తాము వెళ్లటం లేదని.. విద్యార్థులు అందోళన ఉన్న నేపథ్యంలో.. వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఒక పరిష్కారం చూపాల్సిన బాధ్యత ఇరు రాష్ట్రాల్లోని ప్రభుత్వం మీదా.. అధికారుల మీదా ఉందని.. మీ మధ్యనున్న విబేదాల్ని మీరు పక్కన పెట్టి.. విద్యార్థుల కోసం ఇరువర్గాలు చర్చించుకొని పరిష్కారం వెతకాలని సూచించింది. మరి.. రెండు తెలుగు రాష్ట్రాలు ఇప్పటికైనా చర్చలు జరుపుతాయా..?
Tags:    

Similar News