హైకోర్టులో వ‌రుస ఎదురుదెబ్బ‌లు.. పున‌రాలోచ‌న‌లో సీఎం జ‌గ‌న్‌

Update: 2020-05-23 08:10 GMT
భారీ మెజార్టీతో అధికారంలోకి వ‌చ్చి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సంక్షేమ‌, అభివృద్ధి కార్య‌క్ర‌మాలు అమ‌లు చేస్తూ దూసుకెళ్తుండ‌గా కొన్ని విష‌యాల్లో ప్ర‌తిప‌క్షాలు, కొంద‌రు అడ్డంకులు సృష్టిస్తున్నారు. న్యాయ‌స్థానాల‌ను ఆశ్ర‌యించి కొన్ని విష‌యాల్లో తీవ్ర ఆటంకం క‌లిగిస్తున్నారు. ఈ స‌మ‌యంలో అత్యున్న‌త న్యాయ‌స్థానంలో ప్ర‌భుత్వానికి నిరాశ ఎదుర‌వుతోంది. వ‌రుస ఎదురుదెబ్బ‌లు త‌గులుతున్నాయి. దీంతో ప్ర‌భుత్వంపై న్యాయ‌స్థానాల్లో ప్ర‌తిప‌క్షాలు, ప్ర‌త్య‌ర్థులు పైచేయి సాధిస్తున్నారు. దీంతో ప్ర‌భుత్వం ఇర‌కాటంలో ప‌డుతోంది. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ఆంగ్ల మాధ్య‌మం, రాజధాని తరలింపు, రాజధానిలో పేదలకు భూములు, కార్యాల‌యాల‌కు పార్టీ రంగులు, డాక్టర్ సుధాకర్, ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ వ‌ర‌కు ఎన్నో విష‌యాల్లో ప్ర‌త్య‌ర్థులు కోర్టులను ఆశ్ర‌యిస్తూ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నిర్ణ‌యం తీసుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే శుక్ర‌వారం ఒక్క‌రోజే మూడు విష‌యాల్లో ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నిర్ణ‌యాలు వ‌చ్చాయి. ప్ర‌భుత్వానికి ఎదురుదెబ్బ‌లు త‌గిలాయి. దీంతో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పున‌రాలోచ‌న‌లో ప‌డ్డారు. ఈ స‌మ‌యంలో న్యాయ‌స్థానంలో ఉన్న త‌న టీమ్‌ను మార్చే ఆలోచ‌నలో ముఖ్య‌మంత్రి ఉన్నార‌ని తెలుస్తోంది.

ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేయడం, డాక్టర్ సుధాకర్ వ్యవహారం, ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ఎత్తివేత‌తో ఏపీ సర్కారుకు హైకోర్టులో ఎదురుదెబ్బలు త‌గిలాయి. దీనిపై ప్రభుత్వం పున‌రాలోచ‌న‌లో ప‌డింది. తాజా తీర్పులపై ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ స‌మీక్ష జ‌రిపారు. ప్రభుత్వంలోని పెద్దలతో శ‌నివారం ఉద‌యం సీఎం జగన్ స‌మాలోచ‌న‌లు చేశారు. కీలక నేతలను పిలిపించుకుని హైకోర్టులో తాజా పరిణామాలపై చర్చిస్తున్నారు. ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు స‌స్పెన్ష‌న్ ఎత్తివేత మాత్రం ప్ర‌భుత్వానికి చెంప‌పెట్టు మాదిరి అయ్యింది. దీనిపై తీవ్ర అస‌హ‌నం వ్య‌క్త‌మైంది. ఈ మూడింటిపై తదుపరి చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

అయితే హైకోర్టు తీసుకున్న నిర్ణ‌యాల‌పై ఏపీ ప్ర‌భుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. ముఖ్యంగా వెంక‌టేశ్వ‌రావు స‌స్పెన్ష‌న్ వ్య‌వ‌హారం ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తోంది. ప్రభుత్వానికి ప‌రువు సంబంధించిన విష‌యం కావ‌డంతో ఈ మూడింటి విష‌యంలోనూ ఉన్న‌త న్యాయ‌స్థానం ఆశ్ర‌యించే ప‌నిలో ప‌డింది. హైకోర్టు తీర్పులపై సుప్రీంకోర్టులో సవాల్ చేసే అవకాశ ఉంది.

హైకోర్టులో వ‌రుస ఎదురుదెబ్బ‌లు త‌గులుతుండ‌డంతో లీగల్ టీమ్ మార్చేందుకు కూడా ప్ర‌భుత్వం దృష్టి సారించింది. ఆ బృందంలో మార్పులు చేర్పులు చేసే అవ‌కాశం ఉంది. స‌మ‌ర్ధులైన వ్య‌క్తుల‌కు ఆ టీమ్‌లో బాధ్య‌త‌లు ఇచ్చేలా అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఎందుకంటే ప్ర‌భుత్వానికి అప్ర‌తిష్ట వ‌చ్చేలా హైకోర్టులో ప‌రిణామాలు జరుగుతున్నాయి. లీగ‌ల్ టీమ్ స్ట్రాంగ్‌గా ఉంటే ప్ర‌త్యర్థుల‌కు గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చి న్యాయ‌స్థానాల్లో బ‌లంగా వాదించి పైచేయి సాధించేలా చ‌ర్య‌లు చేప‌ట్టే యోచ‌న‌లో ప్ర‌భుత్వం ఉంది. ఇప్ప‌టికే రాజ‌కీయ‌ప‌రంగా.. ప్ర‌భుత్వ ప‌రంగా స్ట్రాంగ్‌గా ఉండ‌గా.. ఇప్పుడు లీగ‌ల్ టీమ్ ప‌క‌డ్బందీగా ఉంటే ఏ విష‌యంలోనూ ఇక ప్ర‌త్య‌ర్థులు ద‌రిదాపుల‌కు వ‌చ్చే అవ‌కాశం ఉండ‌ద‌ని అధికార పార్టీ భావిస్తోంది. ఈ మేర‌కు త్వ‌ర‌లోనే చ‌ర్య‌లు తీసుకునే ఆస్కారం ఉంది.
Tags:    

Similar News