ఐటీ గ్రిడ్ కేసులో అశోక్ కు బిగుసుకున్న ఉచ్చు

Update: 2019-05-29 12:03 GMT
ఆంధ్రప్రదేశ్ ప్రజల వ్యక్తిగత డేటాను చోరీ చేసి టీడీపీకి అప్పగించారన్న ఆరోపణలపై ఐటీ గ్రిడ్స్ సంస్థపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఐటీ గ్రిడ్ సంస్థ సీఈవో అశోక్ పరారీలో ఉండడంతో ఆయన కోసం గాలిస్తున్నారు. ఆయనను చంద్రబాబు ప్రభుత్వం ఇన్నాళ్లు కాపాడిందన్న ఆరోపణలు వచ్చాయి.కానీ ఇప్పుడు ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడంతో ఐటీ గ్రిడ్ అశోక్ రంగారెడ్డి జిల్లా కోర్టును వారం రోజుల క్రితం ఆశ్రయించాడు. కానీ కోర్టు ఈ పిటీషన్ ను కొట్టి వేసి లొంగిపోవాలని ఆదేశించింది.  

అయితే తాజాగా బుధవారం ఐటీ గ్రిడ్ అశోక్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. డేటా చోరీ వ్యవహారంలో మాదాపూర్ పోలీసులు తనపై నమోదు చేసిన కేసులలో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని అశోక్ పిటీషన్ దాఖలు చేశారు. అయితే తెలంగాణ,ఏపీ డేటా చోరీ చేసిన అశోక్ విచారణను ఎదుర్కోవాలని.. ఇది సీరియస్ కేసు అని తెలంగాణ అడ్వకేట్ జనరల్ వాదించారు. దీంతో  ఈ పిటీషన్ ను విచారించిన హైకోర్టు పిటీషన్ ను జూన్ 4కు వాయిదా వేసింది.

ఇప్పటికే రంగారెడ్డి కోర్టు అశోక్ బెయిల్ పిటీషన్ ను కొట్టివేసింది. దీంతో అశోక్ తన భార్య శ్రీలక్ష్మీ సాయంతో హైకోర్టు లో పిటీషన్ వేశారు. ఇప్పటికే కేసుల రద్దు కోసం హైకోర్టులో క్యాష్ పిటీషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న అశోక్ ఏపీలో ప్రభుత్వం మారడంతో అక్కడి నుంచి షిఫ్ట్ అయినట్టు తెలిసింది. అశోక్ కోసం నాలుగు పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. విజయవాడ, విశాఖ, ముంబై, బెంగళూరులో అతని కోసం గాలిస్తున్నారు.

    

Tags:    

Similar News