తెలంగాణ ప్రభుత్వం పై మ‌రోసారి మండిపడ్డ హైకోర్టు ..ఎందుకంటే !

Update: 2021-06-01 11:30 GMT
తెలంగాణ ప్ర‌భుత్వంపై హైకోర్టు మరోసారి ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ప‌బ్లిక్ హెల్త్ డైరెక్ట‌ర్ ఇచ్చిన నివేదిక‌పై హైకోర్టు అసంతృప్తి వ్య‌క్తం చేసింది. తాము ఇచ్చిన ఆదేశాలు పాటించ‌లేద‌ని , కరోనా చికిత్స‌ల ధ‌ర‌ల‌పై కొత్త జీవో ఇవ్వ‌లేద‌ని మండిప‌డింది.  సలహా కమిటీ ఎందుకు ఏర్పాటు చేయలేదని నిలదీసింది. పైగా మూడో దశ సన్నద్ధతపై ఇచ్చిన వివరాలు సమగ్రంగా లేవని అసహనం వ్యక్తం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో చిల్లల కోసం నీలోఫర్‌ ఆస్పత్రి ఒక్కటే సరిపోతుందా అని ప్రశ్నించింది. రాష్ట్ర కరోనా పరిస్థితులపై ప్రధాన న్యాయమూర్తి హిమా కోహ్లీ, జస్టిస్ విజయసేన్ రెడ్డిల కూడిన ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది.

ఈ నేపథ్యంలో ధర్మాసనం ప్రభుత్వంపై ప్రశ్నలు కురిపించింది. మరోవైపు లైసెన్స్‌లు రద్దు చేసిన ఆస్పత్రుల్లో బాధితులు చెల్లించిన సొమ్మును తిరిగి ఇచ్చారా అని ప్రశ్నించింది హైకోర్టు. బంగారు తాకట్టు పెట్టి ఆస్పత్రులకు ఫీజులు చెల్లిస్తున్నారని గుర్తు చేసింది. ఇంకోవైపు, కేటాయించిన బ్లాక్ ఫంగస్‌ ఔషధాలను ఎందుకు సరఫరా చేయలేదో తెలపాలని కేంద్రాన్ని ఆదేశించింది హైకోర్టు. అలాగే, కొత్త ఏర్పాటు చేసిన ఆర్టీపీసీఆర్ ల్యాబ్‌లు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయని కోర్టు ప్రశ్నించింది. తాము అడిగిన ఏ ఒక్క అంశానికి నివేదిక‌లో స‌రైన స‌మాధానంలేద‌ని వ్యాఖ్యానించింది. ఇక‌, రేపు జ‌రిగే విచార‌ణ‌కు.. హెల్త్ సెక్ర‌ట‌రీ, ప‌బ్లిక్ హెల్త్ డైరెక్ట‌ర్, డీజీపీ.. అంద‌రూ హాజ‌రుకావాల్సిందేన‌ని హైకోర్టు స్ప‌ష్టం చేసింది.

మ‌హారాష్ట్రలో 8 వేల మంది చిన్నారుకులు ఇన్‌ పెక్ష‌న్ వ‌చ్చిద‌ని గుర్తుచేసిన న్యాయ‌స్థానం, ఈ విష‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని ప్ర‌శ్నించింది. విచార‌ణ సంద‌ర్భంగా ప్రైవేట్ ఆస్ప‌త్రుల్లో చికిత్స‌ల ధ‌ర‌లు ఒకేళా ఉండాల‌న్న ఆదేశాల‌ను అమ‌లు చేశార‌ని అని ప్ర‌శ్నించింది. అలాగే ఎవ‌రివైతే లెసెన్స్‌ లు ర‌ద్దు చేశారో. వారినుంచి క‌రోనా రోగుల‌కు డ‌బ్బులు తిరిగి ఇప్పించారా, అని ప్ర‌శ్నించింది. రేప‌టి విచార‌ణ‌కు హెల్త్ సెక్ర‌ట‌రీ, డీజీపీ స‌హా అంద‌రూ హాజ‌రుకావాల‌ని ఆదేశించింది. ఇక‌, థ‌ర్డ్ వేవ్‌కు ప్ర‌భుత్వం ఎలా స‌న్న‌ద్ధం అవుతోంది? అని ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించింది హైకోర్టు.. దీనిపై వివ‌రాలు లేవా? అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.. ఈ ద‌శ‌గా మీరు తీసుకుంటున్న చ‌ర్య‌లు ఏంటి? అని ప్ర‌శ్నించింది.. నిలోఫ‌ర్‌లో 200 ప‌డ‌క‌లు ఏర్పాటు చేస్తే స‌రిపోతుందా? అని ప్ర‌శ్నించింది.
Tags:    

Similar News