ఏపీలో ఉద్యోగులకు, ప్రభుత్వానికి మధ్య ఏర్పడిన పీఆర్సీ వివాదం.. కీలక మలుపు తిరిగింది. ఇప్పటి వరకు ప్రభుత్వం తమ మాటే వినాలని.. ప్రభుత్వానికి సమ్మె తాలూకు సెగ చూపిస్తామని... ప్రకటన లు చేయడంతోపాటు.. చలో విజయవాడకు ప్రభుత్వం కన్ను కప్పి మరీ.. విజయవాడ చేరుకుని .. తమ నినాదాలతో హోరెత్తించిన ఉపాధ్యాయులు, ఉద్యోగుల విషయంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలుచేసింది. సర్కారు తన కార్యకలాపాలకు విఘాతం కలిగించే వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని వ్యాఖ్యానించింది.
ఉద్యోగుల సమ్మెను నివారించాలంటూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు లంచ్‌మోషన్‌గా స్వీకరించి శుక్రవారం రాత్రి పొద్దుపోయాక విచారించింది. జస్టిస్ ప్రవీణ్ కుమార్, జస్టిస్ మన్మథరావులతో కూడిన ధర్మాసనం ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. చట్టానికి విరుద్ధంగా ఏం జరిగినా దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఆ స్వేచ్ఛ ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేసింది. పెన్ డౌన్ అయినా, సమ్మె అయినా అలాంటి కార్యక్రమం ఏం చేసినా రూల్ 4 కింద నిషేధం ఉందని అడ్వకేట్ జనరల్ కోర్టుకు వివరించారు.
అలాంటప్పుడు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే కదా? అని హైకోర్టు ప్రశ్నించింది. ఈ సందర్భంగా పరిపాలన సవ్యంగా సాగేలా తగిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వం తగిన విధంగా వ్యవహరించలేకపోతోందని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. గురువారం విజయవాడలో జరిగిన ర్యాలీకి ఎలా అనుమతి ఇచ్చారని కోర్టు ప్రశ్నించింది. దీనికి సమాధానంగా ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని ఏజీ తెలిపారు.
సోమవారం నాటికి పరిస్థితులను పరిగణలోకి తీసుకుని విచారణ కొనసాగిస్తామని హైకోర్టు తెలిపింది. చట్టవిరుద్ధ కార్యకలాపాలను.. ప్రభుత్వం నియంత్రిస్తుందని ఆశిస్తున్నామని పేర్కొంది. ఉద్యోగులు ఏమి చేయబోతున్నారో తెలియకుండా స్పందించలేమన్న హైకోర్టు అభిప్రాయపడింది. ఉద్యోగుల వాదనలు కూడా వింటామని కోర్టు పేర్కొంది. మొత్తానికి ఉద్యోగులు-ప్రభుత్వానికి మధ్య ఏర్పడిన వివాదంలో హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.