ఏపీలో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు హైకోర్టు అక్షింతలు వేసింది. వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన 20 మంది ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ 20 మంది ఎమ్మెల్యేలు వైసీపీ తరపును గెలిచి, అనంతరం అధికార తెలుగుదేశం పార్టీలో చేరారు. దీంతో వీరి ఫిరాయింపులపై దాఖలైన పిటిషన్ పై ఈ రోజు ఉమ్మడి హైకోర్టులో విచారణ ప్రారంభమయింది. నోటీసులు జారీ చేసిన తర్వాత తదుపరి విచారణను నాలుగు వారాల పాటు హైకోర్టు వాయిదా వేసింది.
కాగా తాజా పరిణామాలతో చర్యలు తప్పవన్న ఆందోళన ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో కనిపిస్తోంది. ముఖ్యంగా పార్టీ మారినా కూడా ప్రయోజనం లేకపోగా లీగల్ గా ఇరుక్కుపోతుండడం.. జనంలో పరువు పోగొట్టుకోవడంతో తమ రాజకీయ భవిష్యత్తు ఏమిటా అన్న ఆందోళన వారిలో కనిపిస్తోంది.
వైసీపీ ఎమ్మెల్యేలకు ఎన్నో ఆశలు చూపి టీడీపీలోకి తెచ్చారు. మంత్రి పదవులు... కార్పొరేషన్ పదవులు.. కాంట్రాక్టులు - పనులు - అనుమతులు... ఇలా ఒకటేమిటి ఎన్నో ఆశలు కల్పించినా ఏవీ నిజం చేయలేదు చంద్రబాబు. పైగా ఆయా నియజకవర్గాల్లో ఉన్న టీడీపీ నాయకులతోనూ విబేదాలు నిత్య చీకాకులు తెస్తున్నాయి. ఇలా అన్ని వైపులా ఇబ్బందులే ఉన్న సమయంలో కోర్టు నుంచి కూడా ప్రతికూల సంకేతాలు కనిపిస్తుండడంతో వారిలో టెన్షన్ మొదలైంది. తమపై అనర్హత వేటు పడినా పడొచ్చని కొందరు భయపడుతున్నారు. దాంతో ఇప్పుడు కొందరు పశ్చాత్తాప పడుతున్నారట. ఉన్నది ఉంచుకున్నది రెండూ పోయేటట్లుంది అని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే వ్యాఖ్యానించడం ఇక్కడ గమనార్హం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/